ETV Bharat / bharat

అడ్వాణీని ముంచిన శిష్యుడు మోదీ: రాహుల్​ - ప్రేమిస్తున్నాను

నరేంద్ర మోదీపై తనకెలాంటి ద్వేషం లేదని కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ మరోసారి స్పష్టంచేశారు. తాను మోదీని ప్రేమిస్తున్నప్పటికీ ఆయనకే తనపై కోపం ఉందని రాహుల్​ పేర్కొన్నారు. మోదీ గురువు అడ్వాణీనే పక్కన పెట్టారని, హిందుత్వం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. పుణేలో విద్యార్థులతో ముఖాముఖిలో రాహుల్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

అడ్వాణీ
author img

By

Published : Apr 5, 2019, 7:51 PM IST

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ మరోసారి మోదీని తాను ప్రేమిస్తున్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుణేలో విద్యార్థులతో ముఖాముఖిలో రాహుల్​ పాల్గొన్నారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు.

విద్యార్థులతో ముఖాముఖిలో రాహుల్

"నేను నరేంద్ర మోదీని ప్రేమిస్తున్నాను. నిజంగా చెప్తున్నా ఆయనపై నాకెలాంటి కోపం కానీ ద్వేషం కానీ లేవు. ఆయనకే నాపై కోపం ఉంది. ఏం ఫర్వాలేదు. ఇక్కడ చిన్న తేడా ఉంది. ఆయన ఇలా ఆలోచించలేరు." -రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు

రాహుల్​ ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు సభా ప్రాంగణం మొత్తం మోదీ.. మోదీ అంటూ అరిచారు. అయినప్పటికీ రాహుల్​ గాంధీ వారిని వారించలేదు. నాకు ఏం ఫర్వాలేదు. మీ పైనా నాకు కోపం లేదని బదులిచ్చారు.

గురువును ముంచిన శిష్యుడు..!

నరేంద్ర మోదీపై రాహుల్​ గాంధీ పదునైన విమర్శనాస్త్రాలు సంధించారు. భాజపా వ్యవస్థాపకుల్లో ఒకరైన అడ్వాణీని మోదీ పక్కన పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

"భాజపా హిందూయిజం గురించి మాట్లాడుతుంటుంది. హిందుత్వంలో గురువుకి అత్యంత విలువ ఇస్తాం. గురుశిష్యుల గురించి మాట్లాడుకుంటే..మోదీ గురువు ఎవరు..? అడ్వాణీ. ఆయననే మోదీ పక్కన పెట్టేశారు."
-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు

2019 ఎన్నికల్లో ఎల్​కే అడ్వాణీకి టికెట్ ఇవ్వకుండా ఆ స్థానాన్ని భాజపా అధ్యక్షుడు అమిత్​ షా కు కేటాయించింది పార్టీ. ఈ విషయంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

Saharanpur (UP), Apr 05 (ANI): Ahead of the Lok Sabha election in the state, Prime Minister Narendra Modi is conducting public rallies in a full swing. On Friday, he addressed a public rally in Uttar Pradesh's Saharanpur. He lashed out at the Congress by targeting its recently released manifesto. Terming Congress' manifesto 'dhakosla patra' PM Modi said, According to Congress' 'dhakosla patra,' rape accused will get bail. People who set blaze the brides for dowry should get bail? He asked to public.' The Lok Sabha election is scheduled to start in Uttar Pradesh in seven phases from April 11.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.