ETV Bharat / bharat

కార్యకర్తల సంతోషమే మా జీవనమంత్రం: మోదీ

2019 ఎన్నికల్లో ఘన విజయం అనంతరం తొలిసారి వారణాసిలో పర్యటించారు మోదీ. భాజపా కార్యకర్తలతో సమావేశమయ్యారు. తన గెలుపునకు కాశీ ప్రజలే కారణమని, కార్యకర్తల ఆదేశాలే తనకు ఎంతో ముఖ్యమని తెలిపారు మోదీ.

కార్యకర్తల సంతోషమే మా జీవనమంత్రం: మోదీ
author img

By

Published : May 27, 2019, 1:55 PM IST

Updated : May 27, 2019, 7:58 PM IST

సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం అందించినందుకు వారణాసి ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. గెలుపోటములకు అతీతంగా కాశీవాసులు సార్వత్రిక ఎన్నికలను ఒక పండుగలా జరుపుకున్నారని హర్షం వ్యక్తం చేశారు.

వారణాసిలో భాజపా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు మోదీ. పార్టీ శ్రేణుల కఠోర శ్రమ వల్లే విజయం సాధించగలిగానని ప్రశంసించారు. పార్టీ కార్యకర్తల సంతోషమే తన జీవనమంత్రమని ప్రధాని స్పష్టం చేశారు.

'మీ కఠోర శ్రమే నా విజయానికి కారణం'

"నామినేషన్​ దాఖలు చేయడానికి ఒక నెల ముందు ఇక్కడకి వచ్చినప్పుడు కాశీ ఒక విశ్వరూపంలా కనపడింది. ఇది కేవలం వారణాసినే ప్రభావితం చేయలేదు. యావత్​ భారతదేశాన్ని ప్రభావితం చేసింది. నామపత్రం దాఖలు చేశాక ఇక్కడ ప్రజలను, కార్యకర్తలను కలిసే అవకాశం లభించింది. ఒక నెల వరకు కాశీకి రాకూడదని కార్యకర్తలు నన్ను ఆదేశించారు. దేశ ప్రజలు నన్ను ప్రధానిని చేసినా... మీకు మాత్రం నేను కార్యకర్తనే. మీ ఆదేశాలే నాకు ఎంతో ముఖ్యం. ప్రచారాలు, ఎన్నికల సమయంలో నేను ఉన్నంత నిశ్చింతగా మరెవరూ లేరేమో. ఈ నిశ్చింతకు కారణం మోదీ కాదు. మీ కఠోర శ్రమే ఇందుకు కారణం."
--- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

'మోదీ గెలుపు అప్పుడే ఖాయమైంది'

నామపత్రం దాఖలు చేయడానికి కాశీ వచ్చిన రోజే మోదీ గెలుపు ఖాయమైందన్నారు భాజపా అధ్యక్షుడు అమిత్​షా. ప్రధానికి మద్దతుగా నిలిచి రెండోసారి లోక్​సభకు ఎన్నుకున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు షా.

ఇదీ చూడండి: కాశీ విశ్వేశ్వరాలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు

New Delhi, May 27 (ANI): Congress leader Pramod Tiwari on Monday said that the murder of Surendra Singh, ex-pradhan of Amethi and Smriti Irani's close aide should not be politicised and the killers should be arrested as soon as possible. Speaking to ANI, Tiwari said, "The murder of BJP worker Surendra Singh in Amethi is a very sad and unfortunate incident. It should not be equated with politics as the person who died had visited a stage of Samajwadi Party (SP) and Congress before. He had also welcomed Congress president Rahul Gandhi in Amethi before." Everyone has the right to pay homage to the deceased but the politicisation of the issue should be avoided, said Tiwari citing BJP leader Smriti Irani's visit to Amethi where she participated in the funeral procession of Singh to pay her tributes. Surendra Singh was shot dead by unidentified assailants when he was sleeping in the verandah of his house at around 3 am on Sunday. He was rushed to a trauma centre in Lucknow where he succumbed to injuries.
Last Updated : May 27, 2019, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.