ప్రధాని నరేంద్రమోదీకి తమిళనాడులో తిరుచ్చి జిల్లా ఎరకుడిలో ఆలయం కట్టారు. మోదీకి వీరాభిమాని, భాజపా కార్యకర్త శంకర్ తన పొలంలో సొంత ఖర్చుతో ఆలయం కట్టి.. మోదీ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు.
ప్రతిరోజు కుటుంబ సమేతంగా పాలాభిషేకం, దీపారాధన, పూజలు చేస్తున్నాడు. చాలా కాలం నుంచి మోదీ అంటే ఇష్టమని శంకర్ చెబుతున్నాడు. రాజకీయాలను పక్కనబెడితే.. మోదీ చాలా మంచి వ్యక్తి అని అంటున్నాడు. కేంద్ర ప్రభుత్వ పథకాల వల్ల తాను ఎంతో లబ్ధి పొందుతున్నట్లు శంకర్ పేర్కొన్నాడు.
ఆలయం కట్టే స్థోమత లేకపోయినా డబ్బు జమ చేసి మరీ నిర్మించాడు శంకర్. సీనియర్ నేతలతో మోదీ విగ్రహానికి కుంబాభిషేకం చేయించటమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు.
ఇదీ చూడండి: బోర్డు పునర్వ్యవస్థీకరణతో పట్టాలపైకి... రైల్వే!