ETV Bharat / bharat

'సుస్థిర, సురక్షిత భారతావని నిర్మాణమే లక్ష్యం' - Red Fort

ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలు
author img

By

Published : Aug 15, 2019, 6:29 AM IST

Updated : Sep 27, 2019, 1:44 AM IST

09:07 August 15

ఎర్రకోట వద్ద అట్టహాసంగా పంద్రాగస్టు వేడుకలు

73వ స్వాతంత్ర్య వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. దిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ త్రివర్ణ పతకాన్ని ఎగరవేశారు. ఎర్రకోటకు చేరుకున్న తర్వాత సైనిక వందనాన్ని స్వీకరించిన ప్రధాని మోదీ... కేంద్ర మంత్రులు, మాజీ ప్రధానులు, త్రివిధ దళాధిపతులు, ప్రముఖులు, ప్రజల సమక్షంలో ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. 

'నవభారత ప్రణాళిక' ఆవిష్కరణ...

జెండా ఆవిష్కరణ తర్వాత జాతినుద్దేశించి ప్రసంగించారు ప్రధాని నరేంద్రమోదీ. నవ భారత నిర్మాణమే లక్ష్యంగా తమ ప్రభుత్వం నిరంతర కృషిచేస్తోందని ఉద్ఘాటించారు. ప్రతి రంగంలో, ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు తెచ్చేందుకు చేపడుతున్న చర్యలను, నిర్దేశించుకున్న ప్రణాళికలను ఆవిష్కరించారు. 

10 వారాల ప్రగతి నివేదిక...

మోదీ 2.0 ప్రభుత్వ తొలి 10 వారాల ప్రగతి నివేదికను ఎర్రకోట వేదికగా ఆవిష్కరించారు ప్రధాని. ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఆర్టికల్ 370, ఆర్టికల్​ 35ఏ రద్దు..., రైతులకు పింఛను వంటి నిర్ణయాలను ప్రస్తావించారు. 

అవసరాలు... ఆకాంక్షలు

2014-19 మధ్య తొలి దఫా పాలనలో ప్రజల అవసరాలు తీర్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేసినట్లు స్పష్టంచేశారు మోదీ. ఆ ఐదేళ్లలో వచ్చిన మార్పును వివరించారు. "అందరితో కలిసి- అందరికీ ప్రగతి" మంత్రంతో పనిచేసి... తమ ప్రభుత్వం "అందరి విశ్వాసం" చూరగొనగలిగిందని హర్షం వ్యక్తంచేశారు.

2019 ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయాన్ని ప్రస్తావించారు మోదీ. ప్రజల్లో నిరాశ... ఆశగా మారిందనేందుకు ఆ ఫలితాలే నిదర్శనమన్నారు. ప్రస్తుత ప్రభుత్వం... ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తుందని ఉద్ఘాటించారు మోదీ.

ఆర్టికల్​ 370ని శాశ్వతం ఎందుకు చేయలేదు?

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దును ప్రముఖంగా ప్రస్తావించారు ప్రధాని నరేంద్రమోదీ. ఆ అధికరణ కారణంగా జమ్ముకశ్మీర్ ప్రజలు అన్ని రకాలుగా నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితిని మార్చేందుకే తమ ప్రభుత్వం ఈ చారిత్రక నిర్ణయం తీసుకుందని వివరించారు.

ఆర్టికల్​ 370 రద్దును తప్పుబడుతున్న విపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మోదీ. ఆ కశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తిని శాశ్వతం చేయకుండా... ఆర్టికల్​ 370ని తాత్కాలిక నిబంధనగానే ఎందుకు ఉంచారని ప్రశ్నించారు.

జమిలీ తక్షణావసరం...

ఆర్టికల్​ 370 రద్దుతో ఒకే దేశం- ఒకే రాజ్యాంగం కల సాకారమైందని హర్షం వ్యక్తంచేశారు మోదీ. 

జీఎస్టీతో ఒకే దేశం- పన్ను..., విద్యుత్​ రంగంలో ఒకే దేశం- ఒకే గ్రిడ్​..., రవాణా రంగంలో కామన్ మొబిలిటీ కార్డ్​తో ఒకే దేశం- ఒకే కార్డ్​ ఆకాంక్ష నెరవేరిందని గుర్తుచేశారు. 

ఒకే దేశం- ఒకే ఎన్నిక కలను సాకారం చేసుకోవడమే తదుపరి లక్ష్యమని స్పష్టంచేశారు మోదీ. ఇందుకోసం విస్తృత చర్చలు జరగాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. దేశం మరింత అభివృద్ధి చెందేందుకు జమిలీ ఎన్నికలు తప్పనిసరి అన్నారు మోదీ.

జల్​ జీవన్​తో ఇంటింటికీ తాగునీరు

ఇంటింటికీ తాగునీరు అందించడమే లక్ష్యంగా సరికొత్త పథకాన్ని ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. మూడున్నర లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో "జల్​ జీవన్​ మిషన్​" అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

జలసంరక్షణ అవసరాన్ని గుర్తుచేశారు మోదీ. నీటి పొదుపు... ప్రజాఉద్యమంలా మారాలని ఆకాంక్షించారు.

కుటుంబ నియంత్రణ కూడా దేశభక్తే...

నవ భారత నిర్మాణంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు ప్రధాని. ప్రధానంగా... జనాభా విస్ఫోటనాన్ని ప్రస్తావించారు.

జనాభా పెరుగుదలతో రానున్న తరాలకు అనేక సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించారు ప్రధాని. చిన్న కుటుంబం కలిగి ఉండడం ద్వారా దేశాభివృద్ధికి ఉపకరించవచ్చని, అది కూడా ఒక రకమైన దేశభక్తేనని అన్నారు. 

జనాభా నియంత్రణకు కేంద్రం, రాష్ట్రాలు ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు మోదీ.

లక్ష్యం చేరాలంటే హైజంప్​ తప్పనిసరి...

అభివృద్ధి క్రమక్రమంగా జరుగుతుందిలే అని ప్రజలు ఎదురుచూసే పరిస్థితులు లేవన్నారు ప్రధాని. నవభారత లక్ష్యాలను చేరుకుని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రగతి పథంలో హై జంప్​ చేయడం అవసరమని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం తమ ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని వివరించారు.

రూ.100 లక్షల కోట్ల ఖర్చుతో దేశంలో భారీ స్థాయిలో మౌలిక వసతులు అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు మోదీ.

ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు పిలుపు

ఉగ్రవాదంపై అన్ని దేశాలు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు ప్రధాని. ముష్కరులను రక్షిస్తూ, వారికి సహాయ సహకారాలు అందించే దేశాలను ప్రపంచ వేదికపై ఎండగట్టాల్సిన అవసరముందంటూ.... పాకిస్థాన్​ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

సరికొత్త "త్రిశక్తి"...

దేశ భద్రతకు సంబంధించి కీలక ప్రకటన చేశారు ప్రధాని. త్రివిధ దళాల మధ్య మరింత మెరుగైన సమన్వయం, సమర్థమైన నాయకత్వం కోసం చీఫ్​ ఆఫ్​ డిఫెన్స్​ స్టాఫ్​ పేరిట ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 

09:02 August 15

08:47 August 15

08:37 August 15

08:23 August 15

08:22 August 15

08:16 August 15

08:12 August 15

07:56 August 15

సబ్​ కా సాత్​... సబ్​ కా వికాస్​ లక్ష్యంతో ముందుకు...

ఎర్రకోట వేదికగా జాతినుద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ.. సబ్​ కా సాత్​.. సబ్​ కా వికాస్​ లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు స్పష్టం చేశారు. 

'' దేశం అభివృద్ది చెందుతుందా.. మార్పు వస్తుందా అని ప్రజల్లో సందేహం ఉంది. సామాన్య ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దేశం మారుతోంది. 2014 ఎన్నికలకు ముందు దేశమంతా పర్యటించా.. అన్ని వర్గాల కష్టాలు ప్రత్యక్షంగా చూశా. వచ్చే ఐదేళ్లలో మరింత ఉత్సాహం, సంకల్పంతో పరిపాలన అందిస్తాం.''

                          - నరేంద్ర మోదీ, భారత ప్రధాని. 

07:52 August 15

అప్పుడు అవసరాలు... ఇప్పుడు ఆకాంక్షలు

07:50 August 15

ఎర్రకోట వేదికగా 10 వారాల ప్రగతి నివేదిక విడుదల

07:42 August 15

జాతినుద్దేశించి మోదీ ప్రసంగం

ఎర్రకోటలో జెండా ఎగురవేసిన అనంతరం.. జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు ప్రధాని మోదీ. దేశ స్వాతంత్ర్యం కోసం శ్రమించిన ఎందరో మహానుభావులను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయని.. వారికి ఎప్పుడూ అండగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

07:23 August 15

ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలు

73ీRD INDEPENDENCE DAY
జెండా వందనం

ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురువేశారు. అనేక మంది నేతలు, సైనికులు, ప్రజల సమక్షంలో జెండా వందనం చేశారు మోదీ. అంతకుముందు త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ప్రధాని.

07:17 August 15

ఎర్రకోట వద్ద సందడి వాతావరణం

73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద సందడి వాతావరణం నెలకొంది. మరికాసేపట్లో ప్రధాని మోదీ ఎర్రకోటపై జెండా వందనం చేయనున్నారు. అనంతరం జాతినుద్దేశించి ప్రశంగించనున్నారు.

07:11 August 15

రాజ్​ఘాట్​ వద్ద ప్రధాని

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిల్లీలోని రాజ్​ఘాట్​కు చేరుకున్నారు. మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.

06:51 August 15

వాజ్​పేయీ తర్వాత...

దివంగత మాజీ ప్రధాని అటల్​ బిహారీ వాజ్​పేయీ 1998-2003 మధ్య కాలంలో వరుసగా ఆరుసార్లు ఎర్రకోట నుంచి ప్రసంగించారు. ఇప్పటి వరకు ఇదే అత్యధికం. ఈ రికార్డును సమం చేయనున్నారు మోదీ.

06:09 August 15

జాతినుద్దేశించి మోదీ ప్రసంగం..

  • Tomorrow, on Independence Day, PM @narendramodi will pay tributes to Bapu at Rajghat at 7 AM.

    7:30 AM onwards, the Prime Minister’s address from the ramparts of the Red Fort will begin.

    Live coverage of the Independence Day celebrations will commence 6:30 AM onwards.

    — PMO India (@PMOIndia) August 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మరికాసేపట్లో దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు ప్రధాని మోదీ. అనంతరం 7.30 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. 7 గంటలకు రాజ్​ఘాట్​లో మహాత్మ గాంధీకి నివాళులు అర్పించి.. ఎర్రకోటలో జరగనున్న 73వ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొంటారు మోదీ. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ప్రధాని ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మోదీ ప్రసంగం వీటిపైనే..!

73వ స్వాతంత్ర్య దినోత్సవంలో మోదీ ఎలాంటి సందేశం ఇస్తారోనని దేశమంతా ఎదురుచూస్తోంది. ఎర్రకోటపై జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోదీ.. జమ్మూకశ్మీర్​ నుంచి దేశంలో ప్రస్తుత ఆర్థికస్థితి వరకు అనేక అంశాలపై ప్రసంగించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

స్వచ్ఛ భారత్, ఆయుష్మాన్ భారత్, అంతరిక్ష ప్రయోగాలను గురించి ప్రధాని జాతికి వివరించే అవకాశం ఉంది. తన హయాంలో దేశాభివృద్ధికి తీసుకున్న చర్యలను వివరిస్తూ.... మోదీ ప్రగతి నివేదిక సమర్పించనున్నారు. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి తర్వాత వరుసగా ఆరోసార్లు ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన ప్రధానిగా మోదీ గుర్తింపు పొందనున్నారు. ఆర్థిక మందగమనంపై ఉన్న ఆందోళనలను కూడా మోదీ ఈ ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉందని భావిస్తున్నారు

ఆర్టికల్​ 370 రద్దుతో జమ్ముకశ్మీర్​ అభివృద్ధి చెందుతుందని అక్కడి ప్రజలకు హామీనిచ్చిన మోదీ ఈ అంశంపై కశ్మీర్​ ప్రజలకు ప్రత్యేక సందేశమిచ్చే ఆవకాశాలూ లేకపోలేదు

AP Video Delivery Log - 2200 GMT News
Wednesday, 14 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2158: Brazil Women March AP Clients Only 4225092
Thousands march for women's rights in Brazil
AP-APTN-2158: Czech Tight Rope Walker AP Clients Only 4225073
French tight rope walker wows Czech crowd
AP-APTN-2158: Argentina Economy AP Clients Only 4225093
Argentine leader offers help for workers, poor
AP-APTN-2131: Russia Rocket Part no access Russia; Part no use Eurovision 4225091
Suspicions raised after Russian rocket explosion
AP-APTN-2100: US NY Abuse Lawsuits AP Clients Only 4225089
Flurry of sexual abuse suits filed in New York
AP-APTN-2056: US OH Shooting Kollie Court Must credit 'Dayton 24/7 Now'; No access Dayton; No access US broadcast networks; No re-use, no re-sale or archive 4225088
Ohio shooter's friend to remain in jail
AP-APTN-2035: Switzerland Israel AP Clients Only 4225086
Israeli diamond merchant's lawyer on corruption claims
AP-APTN-2022: Canada Trudeau Ethics Must credit CTV; No access Canada 4225085
Commissioner: Canada PM violated ethics
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 27, 2019, 1:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.