ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు నచ్చిన అపురూప దృశ్యానికి సంబంధించిన ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. 'వర్షం పడిన రోజు అద్భుతంగా కనిపించే మోధేరా సూర్య దేవాలయం! ఒకసారి చూడండి..' అనే వ్యాఖ్యను దానికి జతచేశారు. ఆ చారిత్రక స్థల అపురూప సౌందర్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపే ఈ వీడియోలో.. వర్షపు నీరు దేవాలయం మెట్ల గుండా ప్రవహిస్తున్న దృశ్యాలు కనిపిస్తాయి. అయితే.. ఈ వీడియోను కేవలం మూడు గంటల్లోనే 5.8 లక్షల మందికిపైగా వీక్షించారు.
-
Modhera’s iconic Sun Temple looks splendid on a rainy day 🌧!
— Narendra Modi (@narendramodi) August 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Have a look. pic.twitter.com/yYWKRIwlIe
">Modhera’s iconic Sun Temple looks splendid on a rainy day 🌧!
— Narendra Modi (@narendramodi) August 26, 2020
Have a look. pic.twitter.com/yYWKRIwlIeModhera’s iconic Sun Temple looks splendid on a rainy day 🌧!
— Narendra Modi (@narendramodi) August 26, 2020
Have a look. pic.twitter.com/yYWKRIwlIe
మోదీ పంపిన ఈ ప్రదేశం గుజరాత్‌లోని మెహ్‌సనా జిల్లా, మోధేరా గ్రామంలో పుష్పావతి నది ఒడ్డున ఉంది. ఈ ప్రాంతాన్ని పాలించిన చాళుక్య వంశ రాజులు దీనిని 11వ శతాబ్దంలో నిర్మించారు. అనంతరం శిథిలావస్థకు చేరుకున్న ఈ దేవాలయంలో ప్రస్తుతం పూజలు నిర్వహించడం లేదు. దీనిని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జాతీయ ప్రాముఖ్యత గల కట్టడంగా గుర్తించి పరిరక్షిస్తోంది.
ఇదీ చదవండి: నేడు తెరుచుకోనున్న పద్మనాభస్వామి ఆలయం