ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా నేటి ఉదయం భాజపా అగ్రనేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కురు వృద్ధుడు అడ్వాణీకు పాదాభివందనం చేశారు ప్రధాని. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో మర్యాదపూర్వకంగా కలిసి... వారి ఆశీర్వాదాలు అందుకున్నారు. అడ్వాణీ, జోషి లాంటి నేతల వల్లే భాజపా ఈ స్థితికి చేరిందని ట్వీట్ చేశారు ప్రధాని.
" గౌరవనీయులు అడ్వాణీని కలిశాం. దశాబ్దాల తరబడి పార్టీ నిర్మాణానికి దోహదపడిన ఇలాంటి గొప్ప నాయకుల వల్లే నేడు భాజపా విజయం సాధ్యమైంది. "
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
" డాక్టర్ మురళీ మనోహర్ జోషి ఒక పండితుడు, మేధావి. భారతీయ విద్యావ్యవస్థ మెరుగుపడటంలో జోషి కృషి చిరస్మరణీయం. జోషి ఎప్పుడూ భాజపా బలమైన నిర్మాణానికే కృషి చేశారు. నాతో పాటు ఎంతోమంది కార్యకర్తలను తీర్చిదిద్దారు."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
మొత్తం 542 లోక్సభ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో 348 స్థానాల్లో గెలిచి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది మోదీ-షా నేతృత్వంలోని ఎన్డీఏ. మరోసారి కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంది. ఎన్డీఏకు పోటీగా ఎన్నికల బరిలోకి దిగిన యూపీఏ 86 స్థానాలకే పరిమితమైంది.
ఇదీ చూడండి : నమో ప్రభంజనం... ఎన్డీఏ ఘన విజయం