కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. ప్రస్తుత లోక్‌సభ రద్దు తీర్మానంతో పాటు మంత్రివర్గం రాజీనామా లేఖలను మోదీ.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు అందజేశారు . మోదీ రాజీనామాను ఆమోదించిన కోవింద్ నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ప్రధానిగా కొనసాగాలని కోరారు. అందుకు అంగీకరించారు మోదీ.
దిల్లీలో ఈ రోజు సాయంత్రం జరిగిన సమావేశంలో మంత్రిమండలిని రద్దు చేసింది కేంద్ర కేబినెట్.
ఈనెల 30న ప్రధానిగా రెండోసారి మోదీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. మంత్రివర్గంలోకి అమిత్ షాను తీసుకోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
2019 సార్వత్రికంలో ఎన్డీఏ ప్రభంజనం సృష్టించింది. గురువారం ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో భాజపానే సొంతంగా 303 స్థానాలు గెల్చుకొని పూర్తి స్థాయి మెజారిటీ సాధించింది. మొత్తంగా ఎన్డీఏ 348 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. యూపీఏ 86 సీట్లకే పరిమితమైంది.
ఇదీ చూడండి: కోచింగ్ సెంటర్లో మంటలు.. 15 మంది విద్యార్థులు మృతి..