70 ఏళ్ల పాలనలో చేసిన తప్పుల నుంచి కాంగ్రెస్ తప్పించుకోవాలని చూస్తోందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. హరియాణాలోని రోహతక్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ... కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లపై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.
" 70 ఏళ్లు దేశాన్ని కాంగ్రెస్ ఎలా పాలించిందో... ఆ పార్టీ మెదడు ఎలా పనిచేసిందో... తలలో ఎంత అహంకారం ఉందో మూడు పదాల్లో తేల్చేసింది. అవేంటో తెలుసా? అయ్యిందేదో అయింది. నిన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్ద నేతల్లో ఒకరు 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లపై మాట్లాడారు. 'ఘటన జరిగింది.. అయ్యిందేదో అయింది' అన్నారు. ఆ నేత ఎవరో తెలుసా? గాంధీ కుటుంబానికి అత్యంత ప్రీతిపాత్రుడు."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
ఇదీ చూడండి: 'పనితీరుపై మాట్లాడలేకనే గతం మాట్లాడుతున్నారు'