ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌ను దారికి తెచ్చే విషయంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు ప్రధాని నరేంద్రమోదీ. ఎన్డీఏ సర్కారు మాత్రం పాక్ పట్ల కఠిన వైఖరి అవలంబిస్తోందని చెప్పారు.
హరియాణా కురుక్షేత్రలో భాజపా ప్రచార సభలో ప్రసంగించారు మోదీ.
"వాయుదాడుల తర్వాత మన వీర పుత్రుణ్ని పాకిస్థాన్ పట్టుకుంది. అయితే 48 గంటల్లోనే ఆయన్ను విడిచిపెట్టాల్సి వచ్చింది. వాఘా సరిహద్దుకు వచ్చి మనకు వాళ్లు అప్పగించారు. అప్పుడు వాళ్ల ముఖాలు చూసే ఉంటారు మీరు. భారత విదేశాంగ విధానమే అందుకు కారణం. కానీ కాంగ్రెస్ మాత్రం పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కీర్తించింది."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
రాజీవ్‌గాంధీని విమర్శించడంపై కాంగ్రెస్ నేతల మాటల దాడిని ప్రధాని తిప్పికొట్టారు. విపక్ష నేతలు తనను ఎన్నోసార్లు పరుష పదజాలంతో దూషించారని అన్నారు.
ఇదీ చూడండి: కేంద్రంలో 'కిచిడీ సర్కార్' లేనట్టే: మోదీ