సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ, మహారాష్ట్రలోని లోక్‌సభ స్థానాలకు చివరి దశ పోలింగ్ ప్రచారానికి రెండు రోజుల్లో గడువు ముగియనుంది. ఆ రాష్ట్రంలో ప్రచారాన్ని ముమ్మరం చేశాయి పార్టీలు. నేడు మహారాష్ట్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రచార సభల్లో పాల్గొననున్నారు.
ముంబయిలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో నేటి సాయంత్రం జరిగే సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. దాదాపు అదే సమయంలో మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా సంగంనేర్‌లో జరిగే సభకు హాజరవుతారు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ.
మహారాష్ట్ర కంటే ముందు నేడు మధ్యప్రదేశ్‌కు వెళ్తారు ప్రధాని మోదీ. సిధి, జబల్పుర్లో జరిగే సభల్లో పాల్గొంటారు.
మహారాష్ట్రలోని 17లోక్‌సభ స్థానాలకు ఈ నెల 29న పోలింగ్ జరగనుంది. మొత్తం 323 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు మిలింద్ దియోరా, నటి ఊర్మిళ మతోంద్కర్, కేంద్రమంత్రి సుభాష్ భమ్రే సహా మరికొందరు ప్రముఖులు పోటీ చేస్తున్న స్థానాల పోలింగ్ ఈ దశలోనే జరుగుతోంది.