ETV Bharat / bharat

మోదీని మించిపోయిన రాహుల్ గాంధీ - రాహుల్ గాంధీ

సార్వత్రిక సమరంలో అధికార ఎన్డీఏ, విపక్ష యూపీఏ కూటమి ప్రచారాన్ని హోరెత్తించాయి. ఇరువైపులా నేతలు మోతాదుకు మించి విమర్శలు, ప్రతి విమర్శలకు దిగారు. రెండు కూటముల ప్రచార సారథులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీలు పడుతూ సభలు నిర్వహించారు.

మోదీని మించిపోయిన రాహుల్ గాంధీ
author img

By

Published : May 23, 2019, 5:54 AM IST

Updated : May 23, 2019, 6:50 AM IST

మోదీని మించిపోయిన రాహుల్ గాంధీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై రాహుల్ గాంధీ పైచేయి సాధించారు. ఫలితాలు అప్పుడే వెలువడ్డాయా అని ఆశ్చర్యపోవద్దు. రాహుల్​ పైచేయి సాధించింది ఎన్నికల ప్రచారంలో. ఎన్డీఏ, యూపీఏ కూటమి పార్టీలు సార్వత్రిక సమరంలో నెగ్గేందుకు ఎన్నికల ప్రచారాన్ని నువ్వా-నేనా అన్నట్లు నిర్వహించాయి.

ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు బహిరంగ సభలను భారీ స్థాయిలోనే నిర్వహించారు నేతలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు నెలల పాటు క్షణం తీరిక లేకుండా ఎన్నికల ప్రచారంలో గడిపారు. మోదీ 142 బహిరంగ సభల్లో పాల్గొని ఎన్డీఏ తరఫున ప్రచారం చేశారు. నాలుగు రోడ్​షోల్లోనూ పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 145 బహిరంగ సభలు నిర్వహించారు. ఎనిమిది మీడియా సమావేశాలు, అయిదు రోడ్​షోల్లో పాల్గొన్నారు.

ఇద్దరు నేతలు అన్ని రాష్ట్రాల్లో జరిగిన ప్రచారంలో పాల్గొన్నారు. మోదీతో పాటు భాజపా అధ్యక్షుడు అమిత్​షా బహిరంగ సభలు నిర్వహించగా, కాంగ్రెస్​లో రాహుల్​కు తోడుగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రచారంలో పాల్గొన్నారు.

మధ్యప్రదేశ్​లో మే 17న నిర్వహించిన కర్​గోన్ సభతో ప్రచారాన్ని ముగించారు మోదీ. ఎన్నికల ప్రచారం కోసం లక్షా 50 వేల కిలోమీటర్లు మోదీ ప్రయాణించారు. బిహార్​ రాజధాని పట్నాలో ప్రచారాన్ని ప్రారంభించిన రాహుల్.. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంతో ముగించారు.

ఇదీ చూడండి: సార్వత్రిక సమరంలో విజయం ఎవరిది?

Rajouri (Jammu and Kashmir), May 23 (ANI): In a major counter insurgency operation, Jammu and Kashmir (JandK) Police on Wednesday busted a hideout of terrorists in Chatyari forest area of Rajouri district and recovered a stockpile of weapons. The seized ammunition included four automatic assault rifles, four AK rifles, 11 pistols and sets of magazines. Calling it a huge achievement for the security agencies, Rajouri SSP Yougal Manhas said that the removing such a stockpile of weapons from circulation would help the forces in limiting future attacks.
Last Updated : May 23, 2019, 6:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.