ETV Bharat / bharat

భాజపా ఎంపీలను మందలించిన మోదీ

భాజపా ప్రథమ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీల పార్లమెంట్​ హాజరుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. వివిధ బిల్లుల ఓటింగ్ సమయంలో తప్పనిసరిగా పార్లమెంట్​కు హాజరుకావాలని సూచించారని సమాచారం.

author img

By

Published : Jul 2, 2019, 9:45 PM IST

భాజపా ఎంపీలను మందలించిన మోదీ

భాజపా ఎంపీలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మందలించారు. పార్లమెంట్​లో భాజపా ఎంపీల తక్కువ హాజరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన మోదీ బిల్లుల ఆమోదం సమయంలో తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారని తెలుస్తోంది.

'మీరు 2 లక్షల మెజారిటీతో గెలిచి మీ స్నేహితుడే ఓటు వేయకపోతే మీరెలా భావిస్తారు. మీ నియోజకవర్గంలో భాజపా అధ్యక్షుడు అమిత్​షా ర్యాలీ చివరి నిమిషంలో రద్దయితే ఎంత నిరాశకు గురవుతార'ని ప్రశ్నించారు మోదీ. ఎంపీలు లోక్​సభకు హాజరు కాకపోవడం అలాగే అనిపిస్తుందని వ్యాఖ్యానించారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

లోక్​ జనశక్తి పార్టీ నేత చిరాగ్​ పాసవాన్​ను చూసి సభకు ఎలా సన్నద్ధమవ్వాలో నేర్చుకోవాలని మోదీ వ్యాఖ్యానించారని తెలుస్తోంది.

ముమ్మారు తలాక్​ బిల్లు ఓటింగ్ సమయంలో గైర్హాజరే కారణం

జూన్ 21న జరిగిన ముమ్మారు తలాక్ బిల్లు ఓటింగ్ సందర్భంగా ఎంపీల గైర్హాజరు నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ముమ్మారు తలాక్ బిల్లుకు అనుకూలంగా 184 ఓట్లు, వ్యతిరేకంగా 74 ఓట్లు వచ్చాయి. భాజపాకు 303 ఎంపీలున్నా బిల్లు సమయంలో సభలో లేకపోవడం మోదీని అసంతృప్తికి గురిచేసిందని సమాచారం.

17వ లోక్​సభలో తొలిబిల్లుగా ముమ్మారు తలాక్ బిల్లును ప్రవేశపెట్టారు. ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఓటింగ్​ నిర్వహించాలని కోరారు.
మోదీకి భాజపా ఎంపీల హాజరు చాలా కాలంగా సమస్యగా మారింది. గత లోక్​సభలోనూ ఎంపీల హాజరు తక్కువగా ఉండేది.

ఇదీ చూడండి: కర్తార్​పుర్​పై రెండోసారి భేటీకి పాక్​ ప్రతిపాదన

Intro:Body:

pp

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.