ETV Bharat / bharat

భారత్ మరో మైలురాయి... 'మిషన్​ శక్తి' సఫలం

అంతరిక్ష రంగంలో భారత్​ గొప్ప మైలురాయి సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మిషన్​ శక్తి ఆపరేషన్​ విజయవంతమైందని ప్రకటించారు. ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్​ అవతరించిందన్నారు.

భారత్ మరో మైలురాయి... 'మిషన్​ శక్తి' సఫలం
author img

By

Published : Mar 27, 2019, 1:26 PM IST

Updated : Mar 27, 2019, 2:58 PM IST

భారత్ మరో మైలురాయి... 'మిషన్​ శక్తి' సఫలం
త్రివిధ దళాల రూపంలో ఇప్పటికే పటిష్ఠ భద్రతా వ్యవస్థ కలిగిన భారత్​... రోదసిలోనూ తిరుగులేని శక్తిగా అవతరించింది. అంతరిక్షం భద్రత విషయంలోనూ అద్భుత పురోగతి సాధించింది.

మిషన్​ శక్తి...

భద్రత, ఆర్థిక వృద్ధి, సాంకేతిక రంగాల్లో భారత్​ దూసుకెళ్తోంది. పురోగతి ఎంత అవసరమో... సమాచార భద్రత అంతకన్నా ముఖ్యం. అందుకే అంతరిక్షంలో శత్రువుల ఉపగ్రహాల పనిబట్టడంపై దృష్టిపెట్టింది భారత్. అందుకు అవసరమైన ఆయుధాలు అభివృద్ధి చేసింది.

యాంటీ శాటిలైట్​ వెపన్​-ఏశాట్​ను పరీక్షించేందుకు ఈ ఉదయం "మిషన్​ శక్తి" పేరిట ప్రత్యేకం ప్రయోగం నిర్వహించింది. దిగువ భూకక్ష్యలోని ఉపగ్రహాన్ని లక్ష్యంగా ఎంచుకుంది.

శాస్త్రవేత్తలు ఆదేశాలు ఇచ్చిన వెంటనే ఏశాట్​ దూసుకెళ్లింది. నిర్దేశిత ఉపగ్రహాన్ని ధ్వంసం చేసింది. ఈ ప్రయోగం మొత్తం 3 నిమిషాల్లో పూర్తయింది.

స్వయంగా ప్రధాని ప్రకటన...

అంతరిక్ష భద్రత కోసం ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా మాత్రమే ఇలాంటి ఆయుధాలు కలిగి ఉన్నాయి. ఏశాట్ పరీక్ష విజయవంతంతో భారత్​ అగ్ర దేశాల సరసన చేరింది.

ఇంతటి చారిత్రక విజయంపై ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ప్రకటన చేశారు. ఎన్నికల ముందు అసాధారణ రీతిలో జాతినుద్దేశించి ప్రసంగించారు.

ఆత్మరక్షణ కోసమే...

ఏ-శాట్​ అభివృద్ధి వెనుక ఉద్దేశం... ఎవరిపైనో దాడి చేయాలని కాదని మోదీ స్పష్టంచేశారు. రోదసిలో భారతీయ సంపద సంరక్షణకేనని తేల్చిచెప్పారు.
"మిషన్​ శక్తి" ప్రయోగమంతా అంతర్జాతీయ నిబంధనలకు లోబడే జరిగిందని ప్రధాని ఉద్ఘాటించారు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Mar 27, 2019, 2:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.