విపక్షాలపైప్రధాని నరేంద్ర మోదీవిరుచుకుపడ్డారు. అధికారంలో ఉండగా కాంగ్రెస్ ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోలేదని మోదీ ఆరోపించారు. బిహార్‌లోని గయాలో జరిగిన ర్యాలీలో మోదీ ప్రసంగించారు. ఉగ్రవాదంపై విచారణను తప్పుదోవ పట్టించేందుకు హిందూ ఉగ్రవాదం అనే ఆరోపణను ముందుకు తెచ్చిందని విమర్శలు చేశారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దేశం నలుమూలలా బాంబు దాడులు జరిగేవన్నారు మోదీ. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ బాంబు పేలుడు కేసులో స్వామి అసీమానంద సహా మిగతా నిందితులందరికీ ఎన్ఐఏ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని గుర్తు చేశారు.
''మహాకూటమికి కాపాలాదారులు, ఛాయ్‌వాలా, పారిశుద్ధ్య కార్మికులంటే ద్వేషం. సొంత బలంతో ముందుకు సాగేవాళ్లతో వారికి సమస్య. అందుకే వారు చౌకీదార్‌పై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రాణాలు పణంగా పెట్టి సైనికులు స్లీపర్ సెల్స్‌ను పట్టుకుంటే, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రమాదకర ఉగ్రవాదుల్ని మహాకూటమి వదిలేసింది. విపక్షాల ఆలోచనే ఉగ్రవాదులు భారత్‌లో బలపడేలా చేసింది. వేలమంది ప్రాణాలు పోయేందుకు కారణమయింది.''- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి