ETV Bharat / bharat

లాక్​డౌన్ 3.0పై కేంద్రం కసరత్తు.. రేపు మోదీ ప్రసంగం!

author img

By

Published : May 1, 2020, 11:11 AM IST

Updated : May 1, 2020, 11:59 AM IST

MODI MEET
లాక్​డౌన్ 3.0పై కేంద్రం కసరత్తు

11:51 May 01

లాక్​డౌన్ 3.0పై కేంద్రం కసరత్తు- రేపు మోదీ ప్రసంగం!

కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా అమలు చేసిన లాక్​డౌన్​ మరో 2 రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో తదుపరి కార్యచరణపై చర్చించేందుకు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. లాక్​డౌన్​ కొనసాగింపు, కార్యాచరణపైనే ప్రధానంగా చర్చించారు. స్వల్ప సడలింపులతో మరోసారి లాక్​డౌన్​ను​ పొడిగించే అంశంపై సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది. మే 3న లాక్​డౌన్​ గడువు తీరిపోనుండగా.. ఒక్కరోజు ముందు జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగించే అవకాశాలున్నాయి.    

దేశంలో కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపైనా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​ను అడిగి తెలుసుకున్నారు ప్రధాని. కేంద్ర హోం మంత్రి అమిత్​ షా, రైల్వే, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్​ గోయల్​, కేబినెట్​ కార్యదర్శి రాజీవ్​ గౌబా తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. పలు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన దూరప్రాంతాల వారిని రైళ్లలో తరలించే విషయంపైనా మోదీ చర్చించారు.  

నిరంతరం సమీక్ష...

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ పరిస్థితులపై ప్రధాని.. ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నారు. ఇకపై ఆర్థిక కార్యకలాపాలను కొనసాగిస్తూనే కరోనాపై పోరాటం చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెడ్​జోన్లు మినహా.. మిగతా జోన్లలో ఆంక్షలు సడలించాలని చూస్తోంది.

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్​డౌన్​కు ముందు మార్చి 22న తొలిసారి సీఎంలతో చర్చించిన ప్రధాని.. మార్చి 24న 21 రోజుల లాక్​డౌన్ అమలు చేస్తున్నట్లు​ ప్రకటించారు. అనంతరం.. ఏప్రిల్​ 11న మరోసారి వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించి లాక్​డౌన్​ను 19 రోజులు పొడిగించారు.  

చివరగా ఏప్రిల్​ 27న ముఖ్యమంత్రులతో మాట్లాడిన మోదీ... ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు.  లాక్​డౌన్​ అనంతరం.. ఎలా ముందుకెళ్లాలని అభిప్రాయాలను కోరారు. చాలా మంది లాక్​డౌన్​ కొనసాగింపుపైనే మొగ్గు చూపగా... కేంద్రం కూడా ఆ దిశగానే ఆలోచిస్తున్నట్లు సమాచారం.    

11:09 May 01

మంత్రులతో మోదీ కీలక భేటీ- లాక్​డౌన్ 3.0పై కసరత్తు!

  • కరోనాకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కీలక సమావేశం.
  • సమావేశానికి హాజరైన హోంమంత్రి అమిత్ షా, రైల్వే, వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్, క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా.
  • లాక్ డౌన్ కొనసాగింపు, తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం

Last Updated : May 1, 2020, 11:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.