కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా విమర్శల జోరు పెంచారు. ప్రధాని నరేంద్ర మోదీని 'ప్రధాన ప్రచార మంత్రి'గా అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్‌లో రేపు ప్రధాని పర్యటించనున్నారు. మోదీకి స్వాగతం పలకడానికి రోడ్లను తాగునీరుతో శుభ్రం చేస్తున్నారని ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
-
जब पूरा बुंदलेखंड, वहाँ के नर नारी, स्कूलों के बच्चे, फसलें और पशु-पक्षी भयंकर सूखे का आतंक झेल रहे हैं हमारे प्रधान प्रचारमंत्री के स्वागत में पीने का पानी टैंकरों से बाँदा की सड़कों पर उड़ेला जा रहा है। यह चौकीदार हैं या दिल्ली से पधारे कोई शहंशाह? pic.twitter.com/LV4IYuwn2g
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">जब पूरा बुंदलेखंड, वहाँ के नर नारी, स्कूलों के बच्चे, फसलें और पशु-पक्षी भयंकर सूखे का आतंक झेल रहे हैं हमारे प्रधान प्रचारमंत्री के स्वागत में पीने का पानी टैंकरों से बाँदा की सड़कों पर उड़ेला जा रहा है। यह चौकीदार हैं या दिल्ली से पधारे कोई शहंशाह? pic.twitter.com/LV4IYuwn2g
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 23, 2019जब पूरा बुंदलेखंड, वहाँ के नर नारी, स्कूलों के बच्चे, फसलें और पशु-पक्षी भयंकर सूखे का आतंक झेल रहे हैं हमारे प्रधान प्रचारमंत्री के स्वागत में पीने का पानी टैंकरों से बाँदा की सड़कों पर उड़ेला जा रहा है। यह चौकीदार हैं या दिल्ली से पधारे कोई शहंशाह? pic.twitter.com/LV4IYuwn2g
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 23, 2019
"బుందేల్‌ఖండ్‌లోని మహిళలు, పాఠశాలకు వెళ్లే పిల్లలు, పంట పొలాలు, పక్షులు, జంతువులు తీవ్రమైన కరవు పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి సమయంలో మన 'ప్రధాన ప్రచార మంత్రి'కి స్వాగతం పలకడానికి ట్యాంకర్లతో తాగు నీరు తీసుకొచ్చి రోడ్లను శుభ్రపరుస్తున్నారు. ఆయన 'చౌకీదారా' లేక దిల్లీ నుంచి విచ్చేస్తున్న 'చక్రవర్తా'?"
- ట్విట్టర్లో ప్రియాంక గాంధీ వాద్రా
ఉత్తరప్రదేశ్‌లో ప్రచారం...
ఉత్తరప్రదేశ్ ఫతేపూర్‌లో నేడు ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విభజన, విద్వేష పూరిత రాజకీయాలను తిప్పికొట్టి.. భవిష్యత్ తరాల కోసం ఓటు వెయ్యాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజల కన్నా ఎవరూ ఎక్కువ కాదన్నారు. ప్రజల ఆయుధం ఓటేనని దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలని ప్రియాంక కోరారు. అబద్ధాలు చెప్పే వారి కోసం ఓటు వేయకూడదని సూచించారు. తమ కుటుంబం గురించి మాట్లాడేవారు.. ఈ ఐదేళ్లలో ఏం చేశారో చెప్పాలని ప్రియాంకా గాంధీ డిమాండ్ చేశారు.
"ఈ ప్రభుత్వం ప్రజా అభిప్రాయాన్ని వినే స్థితిలో లేదు. నేను ఉత్తరప్రదేశ్‌లోని యువకులను, రైతులను, మహిళలను అందర్నీ కలిశాను. వారి సమస్యలు చెప్పుకునే స్వేచ్ఛ కూడా వారికి లేదు. ఒక వేళ చెబితే వారిని జైల్లో పెడుతున్నారు. తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు వారి సమస్యలు చెబితే పాలకులు ఆనందంగా వినాలి.. పరిష్కరించాలి. ఎవరైతే వారిని అధికారంలో కూర్చోబెట్టారో అలాంటి ప్రజల్నే వారు విస్మరించారు."
- ప్రియాంక గాంధీ వాద్రా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
ఇదీ చూడండి: భారత్ భేరి: సన్నీపై భాజపా భారీ ఆశలు!