జాతీయ భద్రత, అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మారుపేరని ఉద్ఘాటించారు కేంద్ర హోంమంత్రి అమిత్షా. పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వం అన్ని వర్గాలకు ఆశాజ్యోతి వంటిదని వ్యాఖ్యానించారు. మోదీ 2.0 ప్రభుత్వానికి వంద రోజులు పూర్తయిన నేపథ్యంలో అభినందనలు తెలుపుతూ వరుస ట్వీట్లు చేశారు అమిత్ షా.
ఆర్టికల్ 370 రద్దు సహా 70 ఏళ్ల నుంచి ప్రతి భారతీయుడు వేచి చూస్తున్న కీలక, చారిత్రక నిర్ణయాలను మోదీ 2.0 ప్రభుత్వం తీసుకుందని గుర్తుచేశారు షా.
"ఆర్టికల్ 370, 35ఎ రద్దు, ముమ్మారు తలాక్ నుంచి ముస్లిం మహిళలకు విముక్తి, యూఏపీఏ చట్టానికి సవరణ వంటి అనేక చారిత్రక నిర్ణయాలు మోదీ నాయకత్వం వల్లే జరిగాయి."
-అమిత్షా, కేంద్ర హోమంత్రి
దేశ అభివృద్ధి, సంక్షేమం, భద్రత కోసం ఉన్న ఏ అవకాశాన్నీ మోదీ ప్రభుత్వం వదిలిపెట్టదని పేర్కొన్నారు అమిత్ షా.
ఇదీ చూడండి: అండర్ వరల్డ్ డాన్లు, అగ్రనేతలు జెఠ్మలానీ క్లయింట్లే!