ETV Bharat / bharat

'మోదీ పాలనలో అసంఘటిత ఆర్థిక వ్యవస్థ ధ్వంసం'

author img

By

Published : Aug 20, 2020, 6:01 PM IST

ఆరేళ్లుగా అసంఘటిత ఆర్థిక వ్యవస్థను ప్రధాని మోదీ ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. రైతులు, కూలీలు, చిన్న స్థాయి వ్యాపారులను పట్టించుకోకుండా.. ఎంతో కీలకమైన అసంఘటిత రంగాన్ని ధ్వంసం చేశారని విమర్శించారు.

Modi govt destroyed unorganised economy in last 6 years: Rahul
'మోదీ ఆరేళ్ల పాలనలో అసంఘటిత ఆర్థిక వ్యవస్థ ధ్వంసం'

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా.. రైతులు, కూలీలు, చిన్నస్థాయి వ్యాపారులను పట్టించుకోకుండా.. ఆరేళ్లుగా అసంఘటిత ఆర్థిక వ్యవస్థను మోదీ నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఫలితంగా రానున్న రోజుల్లో ఉద్యోగాలు సృష్టించలేని పరిస్థితిలో దేశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఛత్తీస్​గఢ్​లోని 22 జిల్లాల్లో కాంగ్రెస్​ కార్యాలయాల నిర్మాణానికి వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా శంకుస్థాపన చేశారు రాహుల్​. ఈ నేపథ్యంలో.. దేశంలోని 90శాతం ఉద్యోగాలు అసంఘటిత ఆర్థిక వ్యవస్థతోనే వస్తాయని రాహుల్​ గుర్తుచేశారు. కానీ నోట్ల రద్దు, జీఎస్​టీ విధానాలతో వాటిని మోదీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని మండిపడ్డారు.

ఇదీ చూడండి:- 'పీఎం కేర్స్​ నిధులపై సుప్రీం తీర్పు రాహుల్​కు చెంపపెట్టు'

వ్యవస్థీకృత, అసంఘటిత ఆర్థిక వ్యవస్థల మధ్య సమానతలు ఉండటం ఎంతో ముఖ్యమన్నారు కాంగ్రెస్​ సీనియర్​ నేత. కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల్లో వీటిని సమానంగా గుర్తిస్తున్నట్టు తెలిపారు.

"అసంఘటిత ఆర్థిక వ్యవస్థ భద్రంగా, బలంగా ఉంటే.. ఎలాంటి విపత్కకర పరిస్థితులనైనా దేశం ఎదుర్కోగలదు. ఇది అమ్మలు, చెల్లెళ్లు ఇంట్లో డబ్బులు దాయడం వంటిది. చాలా ఉపయోగపడుతుంది. కానీ నోట్ల రద్దు, జీఎస్​టీ వల్ల రైతులు, కూలీలు, చిన్న-మధ్యస్థాయి వ్యాపారులు దెబ్బతిన్నారు."

--- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ సీనియర్​ నేత.

కరోనా వైరస్​, చైనాతో సరిహద్దు వివాదం విషయంలోనూ కేంద్ర ప్రభుత్వంపై ఇటీవలి కాలంలో కాంగ్రెస్​ తీవ్ర విమర్శలు చేస్తోంది.

ఇదీ చూడండి:- '4 నెలల్లో ఉపాధి కోల్పోయిన 2 కోట్ల మంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.