మహాకూటమి చేస్తున్న ఆరోపణలకు ప్రజలే ఓట్ల ద్వారా బుద్ధి చెబుతారని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్ బల్లియా బహిరంగ సభలో ప్రసంగించారు. ఎస్పీ, బీఎస్పీ కూటమి నేతలు అఖిలేశ్ యాదవ్, మాయావతిపై నిప్పులు చెరిగారు మోదీ.
"అత్త-అల్లుడు (మాయావతి-అఖిలేశ్) ఇద్దరూ కలిసి ఎన్నేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారో.. అంతకన్నా ఎక్కువ సమయం గుజరాత్ సీఎంగా ఉన్నా. నేను ఎన్నో ఎన్నికల్లో పోటీకి నిలబడ్డాను. ఇప్పుడూ ఉన్నాను. ఎప్పుడూ కులాన్ని వాడుకుని గెలువలేదు. మహాకుటమికి బహిరంగంగా సవాల్ విసురుతున్నా. మీరు చూపించగలరా? నా వద్ద బినామీ ఆస్తులు ఉన్నాయని? ఏదైనా ఫామ్‌హౌస్ నిర్మించుకున్నానా? షాపింగ్ కాంప్లెక్స్‌లు ఉన్నాయా? విదేశీ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్నానా? విదేశాల్లో ఏమైనా ఆస్తులు కొన్నానా?"
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
ఇదీ చూడండి: చివరి దఫా 'సిత్రం'- అన్న బాటలో సోదరి