ETV Bharat / bharat

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మోదీ విహంగ వీక్షణం

author img

By

Published : May 22, 2020, 7:31 AM IST

బంగాల్​, ఒడిశా రాష్ట్రాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు పర్యటించనున్నట్లు అధికారులు తెలిపారు. అంపన్​ తుపాను ప్రభావిత ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా పరిశీలించనున్నట్లు వెల్లడించారు.

Modi Aerial View of Ampan cyclone Affected Areas in bengal and odisha
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మోదీ విహంగవీక్షణం!

అంపన్ తుపాను బీభత్సానికి అతలాకుతలమైన బంగాల్​, ఒడిశా రాష్ట్రాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పర్యటించనున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాలను ఆయన స్వయంగా సందర్శించనున్నారు.

బంగాల్​లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలిసి ప్రధాని మోదీ ఈ ఏరియల్ సర్వే నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. విహంగ వీక్షణం ద్వారా పరిస్థితిని సమీక్షించనున్నట్లు వెల్లడించారు.

"ప్రధాని ఏరియల్ సర్వే నిర్వహించి, సమీక్ష సమావేశాల్లో పాల్గొంటారు. ఉపశమన, పునరావాస చర్యల గురించి ఈ సమావేశాల్లో చర్చిస్తారు."

- ప్రధానమంత్రి కార్యాలయం

తుపాను బీభత్సం

బంగాళాఖాతంలో ఏర్పడిన అంపన్‌ తుపాను బంగాల్‌, ఒడిశాల్లో బీభత్సం సృష్టించింది. తుపాను తీరం దాటిన సమయంలో వీచిన భీకర గాలులు, భారీ వర్షాలకు 84 మంది మృతి చెందగా.. అనేక మంది గాయపడ్డారు. ఒక్క బంగాల్​లోనే 72 మంది మృతి చెందారని, భారీ స్థాయిలో ఆస్తి నష్టం సంభవించిందని సీఎం మమతాబెనర్జీ వెల్లడించారు.

ఇదీ చూడండి: అలసిపోయిన పాదాలు.. బరువెక్కిన గుండెలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.