ETV Bharat / bharat

మోదీ 2.0: తొలి ఏడాది ప్రోగ్రెస్​ రిపోర్ట్​ ఇది...

రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుంది మోదీ సర్కారు. భారీ అంచనాలతో తిరిగి కొలువుదీరిన మోదీ ప్రభుత్వం.. భాజపా అజెండాను సమర్థంగా అమలు చేసింది. దశాబ్దాల సమస్యలకు పరిష్కార మార్గం చూపింది. ఎన్నో ఆశలు, మరెన్నో వాగ్దానాలను ప్రజల ముందు ఉంచింది.

Modi 2.0
మోదీ 2.0: చారిత్రక నిర్ణయాలు, కీలక వాగ్దానాలు
author img

By

Published : May 30, 2020, 6:46 AM IST

Updated : May 30, 2020, 8:11 AM IST

మోదీ మాయాజాలం.. అమిత్​షా వ్యూహరచన.. 2019 లోక్​సభ ఎన్నికల్లో ఎన్​డీఏను అమేయ శక్తిగా మార్చి భారీ మెజార్టీతో అధికార పీఠంపై కూర్చోబెట్టాయి. మోదీ 2.0 సర్కారు కొలువుదీరి ఏడాది పూర్తయింది. దశాబ్దాలుగా భాజపా ప్రణాళికలో ఉన్న పెద్ద సవాళ్లనే పరిష్కరించింది మోదీ 2.0 సర్కారు.

ఆర్టికల్​ 370 రద్దు నుంచి అయోధ్యలో రామమందిర నిర్మాణం వరకు అన్నీ చారిత్రక విజయాలే. అయితే పౌరసత్వ చట్ట సవరణ వంటి నిర్ణయాలు దేశంలో నిరసన జ్వాలలకు కారణమయ్యాయి. కరోనా కట్టడి కోసం లాక్​డౌన్ విధించే​ వరకు ఇవి కొనసాగాయి.

మోదీ 2.0 వార్షికోత్సవం సందర్భంగా సర్కారు తీసుకున్న చారిత్రక నిర్ణయాలు, ఇచ్చిన కీలక వాగ్దానాలు చూద్దాం...

2019 ఆగస్ట్​ 5: జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చే ఆర్టికల్​ 370 రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జమ్ముకశ్మీర్​ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు.

రైతుల ఆదాయం రెట్టింపు...

ఇది మోదీ 2.0 సర్కారు ఇచ్చిన కీలక వాగ్దానం. 'వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి జాతీయ బ్యాంకు' 2016లో ఈ లక్ష్య సాధన కోసం ఓ నివేదికను తీసుకువచ్చింది. 2017లో నీతి ఆయోగ్​ తన సొంత నివేదికతో ముందుకెళ్లింది.

పీఎం కిసాన్​ (ప్రధాన మంత్రి కిసాన్​ సమ్మాన్​నిధి) పథకం ద్వారా దాదాపు 8.2 కోట్ల మంది రైతులకు మొదటి దఫాగా రూ.62,469 కోట్లు అందాయి.

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా...

2030 కల్లా భారత్​ను ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని మోదీ సర్కారు వాగ్దానం చేసింది. దీని ప్రకారం 2025 కల్లా 5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థికం, 2032 కల్లా 10 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్​ మారాలి.

అయితే అంతర్జాతీయ ద్రవ్య సంస్థ 2019లో భారత వృద్ధి రేటును 6.1% అంచనా నుంచి 4.8 శాతానికి తగ్గించింది. బ్యాంకింగేతర ఆర్థిక రంగం పతనమవుతున్నట్లు పేర్కొంది.

యూఏపీఏ చట్టం...

చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక సవరణ బిల్లును (యూఏపీఏ) తీసుకువచ్చింది మోదీ 2.0 సర్కారు. ఈ బిల్లుకు 2019లో పార్లమెంటు ఆమోదముద్ర వేసింది.

ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం ఓ వ్యక్తిని ఉగ్రవాదిగా ప్రకటించవచ్చు. వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చు. వారిపై ప్రయాణ నిషేధం విధించవచ్చు. అయితే ఈ చట్ట సవరణను విపక్షాలు అమానుషమని అభివర్ణించాయి.

ముమ్మారు​ తలాక్...

2019 ఆగస్ట్​ 1: ముమ్మారు తలాక్​ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ కొత్త చట్టం ప్రకారం ముస్లిం మహిళలకు ఏకకాలంలో మూడుసార్లు తలాక్‌ చెప్పడం క్రిమినల్​ నేరంగా పరిగణిస్తారు. అలా చెప్పిన భర్తకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు.

కేవలం త్రిపుల్​ తలాక్​నే కాకుండా ముస్లిం సమాజంలో ఉన్న బహుభార్యత్వం విధానం సహా పలు అంశాలను రూపుమాపుతూ అందిరికీ ఒకటే చట్టం తీసుకురావాలని మోదీ 2.0 సర్కారు యోచిస్తోంది.

రామ మందిరం...

2019 నవంబర్​ 9: దశాబ్దాల వివాదానికి తెరదించుతూ అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది.

అయోధ్యలోని వివాదాస్పద భూమిలో రామమందిర నిర్మాణం చేసుకోవచ్చని సుప్రీం తెలిపింది. మసీదు నిర్మాణానికి 5 ఎకరాల ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ తీర్పుతో ఎన్నో దశాబ్దాలుగా భాజపా ప్రణాళికలో ఉన్న అతిపెద్ద వాగ్దానం నెరవేరినట్లయింది.

2019 డిసెంబర్​ 11: పౌరసత్వ చట్ట సవరణకు పార్లమెంటు ఆమోదం. పొరుగు దేశాలలో అణచివేతకు గురై తట్టుకోలేక భారత దేశానికి వలస వచ్చిన వివిధ మతాల ప్రజలకు పౌరసత్వం, తద్వారా రక్షణ కల్పించడం ఈ చట్టం ఉద్దేశం.

ఆర్​టీఐ చట్ట సవరణ...

సమాచారా హక్కు చట్ట సవరణ చేసింది మోదీ 2.0 సర్కారు. పారదర్శక చట్టాన్ని ఈ సవరణలు నీరుగారుస్తాయని విమర్శలు వచ్చినప్పటికీ ఈ బిల్లుకు ఆమోదం పలికింది పార్లమెంటు.

ఈ చట్ట సవరణలో కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషనర్ల జీతాలు, పదవీ కాలంలో మార్పులు చేసింది సర్కారు.

జలజీవన్​ మిషన్​...

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి 2024లోపు కుళాయి నీటిని ఇవ్వాలనే ఉద్దేశంతో 2019లో ఈ జలజీవన్​ మిషన్​ను ప్రారంభించారు. కొన్ని రాష్ట్రాల్లో వ్యతిరేకత ఉన్నా దేశవ్యాప్తంగా ఈ పథకం అమలులో ఉంది.

మహిళా సాధికారత...

నిర్భయ నిధి నుంచి మహిళా శిశు సంక్షేమ శాఖ కోసం రూ.201.21 కోట్లు కేటాయించారు. 2019 డిసెంబర్​ 24 వరకు కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని అధికారిక డేటా చెబుతున్నట్లు ఇండియన్​ ఎక్స్​ప్రెస్​ ప్రచురించింది.

భాజపా సర్కారు తీసుకువచ్చిన 'భేటీ బచావో భేటీ పడావో' పథకం ఫలితాలూ ఇదే తీరుగా ఉన్నాయి. ఈ పథకానికి రూ.280 కోట్లు కేటాయిస్తే ఇప్పటివరకు రూ. 43.94 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయి. ఇది మొత్తం కేటాయింపులో 15% మాత్రమే.

మహిళా శక్తి కేంద్ర, ఉజ్వల పథకాల సంగతి ఇంతే. మహిళా శక్తి కేంద్ర పథకానికి రూ.150 కోట్లు కేటాయిస్తే రూ.8.75 కోట్లు ఖర్చు చేశారు. ఉజ్వల పథకానికి రూ.30 కోట్లు కేటాయిస్తే రూ.8.58 ఖర్చు పెట్టారు.

సబ్​కా సాత్​ సబ్​కా వికాస్​...

వన్​ ధన్​ యోజన...

ప్రధానమంత్రి వన్​ ధన్ యోజన కింద 24 రాష్ట్రాల్లో 799 వన్​ ధన్​ వికాస్​ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గిరిజనుల అభివృద్ధి కోసం వీటిని వినియోగిస్తున్నారు.

ఈడబ్ల్యూఎస్​...

సాధారణ కేటగిరీలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% కోటా ఇచ్చేందుకు రూ.4,315.15 కోట్లను కేటాయించింది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం అధీనంలోని 158 ఉన్నత విద్యా సంస్థల్లో ఈ కోటా వర్తిస్తుంది.

పేదలకు ఇళ్లు...

భారతీయ రిజర్వు బ్యాంకు చేసిన రెసిడెన్షియల్​ అస్సెట్​ ప్రైస్​ సర్వే 2019 ప్రకారం గత నాలుగేళ్లుగా ఇళ్ల కొనుగోలు శక్తి గణనీయంగా పడిపోయింది. 2015 మార్చిలో 56.1గా ఉన్న నివాస ధర-ఆదాయం నిష్పత్తి 2019 మార్చికి 61.5కు పెరిగింది.

ప్రధానమంత్రి ఆవాస్​ యోజన కింద ఇంటి రుణాలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉపయోగపడుతున్నాయి. ఇంటి రుణాలపై పన్ను రాయితీ ఇస్తున్నారు.

ట్రాన్స్​జెండర్​ సాధికారత...

2019 జులైలో కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్​జెండర్​ రక్షణ చట్టం 2019ని తీసుకువచ్చింది. ట్రాన్స్​జెండర్ల సామాజిక, ఆర్థిక, విద్యా సాధికారతకు, వారి రక్షణకు ఈ చట్టం భరోసా కల్పిస్తుంది.

Last Updated : May 30, 2020, 8:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.