ఓటర్లను బెదిరిస్తున్న గుజరాత్ ఫతేపురా ఎమ్మెల్యే రమేశ్ కటారా వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. భాజపాకు ఓటు వేయకుంటే గ్రామంలో ఎటువంటి పనులు జరగవని హెచ్చరించిన మాటలు వీడియోలో ఉన్నాయి.
" ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల్లో మోదీ కెమెరాలు పెట్టారు. ఎవరు భాజపాకు ఓటేస్తున్నారో... ఎవరు కాంగ్రెస్‌కు వేస్తున్నారో తెలిసిపోతుంది." -రమేశ్ కటారా, ఫతేపురా భాజపా ఎమ్మెల్యే.
ఈ విషయంపై ఒక రోజులోగా వివరణనివ్వాలని రమేశ్ కటారాకు నోటీసులు జారీ చేశారు దాహోడ్ కలెక్టర్ వీ.ఎల్.ఖరాడి.
మార్ఫింగ్ చేశారు: కటారా
దురుద్దేశంతో ఈ వీడియోను మార్ఫింగ్ చేశారని కటారా ఆరోపిస్తున్నారు. గిరిజన ప్రాబల్యం ఉన్న ప్రాంతం కావడం వల్ల ఓటింగ్‌పై వారికి అవగాహన కల్పించేందుకే మాట్లాడానన్నారు.
ఫతేపురా అసెంబ్లీ స్థానం దాహోడ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. దాహోడ్ నుంచి భాజపా తరఫున కేంద్ర మంత్రి జశ్వంత్ సింగ్ బాభోర్ పోటీలో ఉన్నారు.
సార్వత్రిక ఎన్నికల మూడో దశలో భాగంగా ఈ నెల 23న గుజరాత్‌లోని 26 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది.
ఇదీ చూడండి: బంగాల్లో విదేశీ నటుడి ప్రచారంపై కేంద్రం ఆగ్రహం