ETV Bharat / bharat

ప్రియుడితో కలిసి సొంత చెల్లినే హత్య చేసింది!

author img

By

Published : Oct 3, 2020, 6:39 PM IST

Updated : Oct 3, 2020, 7:36 PM IST

తన ప్రేమకు అడ్డుగా ఉందనే కారణంతో ప్రియుడితో కలిసి తన పదేళ్ల చెల్లినే చంపేసింది ఓ సోదరి. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ మిర్జాపుర్​ జిల్లాలోని భరూహియా గ్రామంలో జరిగింది.

Minor girl kills sister
ప్రియుడితో కలిసి చెల్లిని హత్య చేసిన అక్క

ఉత్తర్​ప్రదేశ్​ మిర్జాపుర్​ జిల్లాలో దారుణం జరిగింది. తన ప్రేమకు అడ్డుగా ఉందనే అక్కసుతో ప్రియుడితో కలిసి చెల్లిని హత్య చేసింది 15 ఏళ్ల అక్క.

మిర్జాపుర్​ జిల్లాలోని భరుహియా గ్రామంలో రైల్వే ట్రాక్​పై అనుమానాస్పద స్థితిలో ఓ బాలిక మృత దేహాన్ని గుర్తించారు పోలీసులు. ఆ తర్వాత రెండు రోజులకు ఇద్దరు బాలికలు కనిపించటం లేదని ఫిర్యాదు అందింది. రెండు ఘటనలకు సంబంధించి దర్యాప్తు వేగంగా పూర్తి చేసి కేసును ఛేదించినట్టు జిల్లా ఏఎస్పీ సంజయ్​ వర్మా తెలిపారు.

"2020, అక్టోబర్​ 1న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో దిలీప్​ సింగ్​ కుమార్తెలు అంజలి(15), నందిని(10) కనిపించకుండాపోయారు. పద్రీ స్టేషన్​లో ఫిర్యాదు నమోదైన క్రమంలో బాలికల కోసం తనిఖీలు చేపట్టారు. ఆ తర్వాత పెద్ద కూతురు తన ప్రియుడితో కలిసి ద్విచక్రవాహనంపై వెళుతుండటం గుర్తించారు. చిన్న కూతురు రైల్వే ట్రాక్​పై శవమై తేలింది. తమ ప్రేమ వ్యవహారంలో చెల్లి అడ్డంకులు సృష్టిస్తోందనే కారణంతో పథకం ప్రకారం తన ప్రియుడి సాయంతో హతమార్చినట్లు ప్రాథమిక విచారణలో తేలింది."

- సంజయ్​ వర్మ, జిల్లా ఏఎస్పీ.

రైల్వే క్రాసింగ్​ సమీపంలో నందిని మృతదేహాన్ని కుళ్లిపోయిన స్థితిలో స్వాధీనం చేసుకున్నారు. శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

కేసును సత్వరం పరిష్కరించిన దర్యాప్తు బృందానికి రూ.25వేల బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు ఏఎస్పీ సంజయ్​ శర్మ.

Last Updated : Oct 3, 2020, 7:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.