ETV Bharat / bharat

బాలికపై 15 రోజుల పాటు అత్యాచారం - బలరాంపుర్​లో దారుణం

ఛత్తీస్​గఢ్​ బలరాంపుర్​లో దారుణం జరిగింది. ఓ చిన్నారిపై ఎనిమిది మంది అతి కర్కశంగా అత్యాచారానికి పాల్పడ్డారు.

minor raped by 8 people in balrampur
బాలికపై 13 రోజుల పాటు...
author img

By

Published : Dec 7, 2020, 4:55 PM IST

ఛత్తీస్​గఢ్​లోని బల్​రాంపుర్​లో ఓ మైనర్​పై ఎనిమిది మంది అత్యాచారానికి పాల్పడ్డారు. 15రోజుల పాటు అతి క్రూరంగా ఈ దారుణానికి ఒడిగట్టారు. వీరిలో నలుగురు బాలురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిపై స్థానిక రాజ్​పుర్​ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది.

నవంబర్​ 20న తమ కూతురు తప్పిపోయినట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సుగ్రుజా జిల్లాలో బాధితురాలి ఆచూకీ కనుగొన్నారు. నిందితులను అరెస్టు చేశారు. బాలల రక్షణ చట్టం(పోక్సో) కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

నమ్మి.. మోసపోయి...

మొదట బాలిక తనకు పరిచయం ఉన్న సాగర్​ అనే యువకుడిని కలిసేందుకు బల్​రాంపుర్​ నుంచి అంబికాపుర్​కు వెళ్లింది. ఇదే అదునుగా భావించిన సాగర్​ ఆమెను స్నేహితుని గదికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో మిగిలిన మిత్రులు (ఏడుగురు) కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. 15 రోజుల పాటు బాలికను గదిలో బంధించారు. అక్కడి నుంచి ఇంటికి చేరుకున్న బాలిక తల్లిదండ్రులకు విషయం తెలిపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సాగర్​తో పాటు అతని మిత్రులు అలాం సాయి, వినయ్​ తిర్కి, సురేందర్​ మింజ్ సహా మరో నలుగురు మైనర్లపై కేసు నమోదు చేశారు. ​

ఇదీ చూడండి: పొగమంచు వల్ల ప్రమాదం- ఆరుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.