ETV Bharat / bharat

బాలికపై పోలీసుల సామూహిక అత్యాచారం! - Bhubhaneswa girl raped by policemen

ఆపదలో అండగా నిలవాల్సిన బాధ్యతాయుత ఉద్యోగం చేస్తూ ఆ శాఖకే మాయని మచ్చ తెచ్చారు ఒడిశాకు చెందిన కొందరు క్రూర పోలీసులు. ఓ మైనర్​పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

minor-girl-gang-raped-by-cops-during-lockdown-in-odisha
బాలికపై పోలీసుల సామూహిక అత్యాచారం!
author img

By

Published : Sep 6, 2020, 10:59 AM IST

Updated : Sep 6, 2020, 11:47 AM IST

ఒడిశాలో రక్షక భటులే.. భక్షకులయ్యారు. ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. దాదాపు రెండు నెలల క్రితం జరిగిన ఈ ఘోరం బాలిక తల్లి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.

భువనేశ్వర్​లోని ఇన్ఫోసిటీ పోలీస్​ స్టేషన్​ ప్రాంతానికి చెందిన బాలికపై 8 మంది మృగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. అందులో పోలీసు సిబ్బంది కూడా ఉండటం దారుణం. లాక్​డౌన్ డ్యూటీ చేస్తూ.. ఒంటరిగా కనిపించిన బాలికను తుపాకీతో బెదిరించి ఘాతుకానికి పాల్పడ్డారు. అంతే కాదు, ఈ సంగతి ఎవరికైనా చెబితే చంపేస్తామన్నారు.

దారుణంగా అత్యాచారానికి గురై.. కుంగిపోయింది ఆ బాలిక. ఎవరితో చెప్పుకోవాలో తెలియక తనలో తానే రోధించింది. తాజాగా ఆ విషాదం నుంచి తేరుకుని విషయం ఇంట్లో చెప్పింది. కూతురికి జరిగిన అన్యాయం విని పోలీస్ స్టేషన్​కు పరిగెత్తారు తల్లిదండ్రులు. మహిళా పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

అయితే, ఆ సమయంలో లాక్​డౌన్ విధులు నిర్వహించేందుకు ఇతర జిల్లాల నుంచి వచ్చిన పోలీసులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భువనేశ్వర్ పోలీసులు అంటున్నారు.

ఇదీ చదవండి: శత్రువు కన్నుగప్పి సరిహద్దుకు చేర్చే రహదారి సిద్ధం!

Last Updated : Sep 6, 2020, 11:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.