ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కొంత మంది సీనియర్లకు చోటు దక్కలేదు. మోదీ హయాంలోనే కేంద్ర మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించిన కొందరికి ఈ సారి నిరాశే ఎదురైంది. రాష్ట్రపతి భవన్ ఎదుట గురువారం జరిగిన కార్యక్రమంలో మోదీ సహా 58 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
మంత్రి మండలిలో చోటు దక్కనిది వీరికే..
కేబినేట్ మంత్రులు
- మేనకా గాంధీ
- సురేష్ ప్రభు
- జేపీ నడ్డా
- రాధా మోహన్ సింగ్
సహాయ మంత్రులు
- రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్
- మహేశ్ శర్మ
- జయంత్ సిన్హా
- ఎస్ఎస్ అహ్లువాలియా
- విజయ్ గోయల్
- కె.అల్ఫోన్స్
- రమేష్ జిగాజినాగి
- రామ్ క్రిపాల్ యాదవ్
- అనంత్ కుమార్ హెగ్డే
- అనుప్రియా పటేల్
- సత్యపాల్ సింగ్
సహాయ మంత్రుల్లో అల్ఫోన్స్ మాత్రమే ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మిగతా వారందరూ విజయ దుందుభి మోగించారు.
మేనకా గాంధీని ప్రొటెమ్ స్పీకర్గా నియమించే అవకాశాలు ఉన్నాయి.
అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, ఉమా భారతీకి కేబినేట్లో చోటు దక్కలేదు. ఆర్థిక మంత్రిగా చేసిన జైట్లీ అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో మంత్రి పదవి వద్దని తెలిపారు. సుష్మా స్వరాజ్, ఉమా భారతి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు.