ETV Bharat / bharat

తొలిరోజు నడిచిన దేశీయ విమానాలెన్నో తెలుసా?

author img

By

Published : May 25, 2020, 11:51 PM IST

Updated : May 26, 2020, 7:10 AM IST

రెండు నెలల తర్వాత దేశీయ విమాన సర్వీసులు పునఃప్రారంభం కావడం వ్లల.. సోమవారం దేశంలోని ప్రధాన విమానాశ్రయాలన్నీ రద్దీగా కనిపించాయి. ఈ ఒక్కరోజే మొత్తం 39 వేల మంది ప్రయాణించగా.. 532 దేశీయ విమాన సర్వీసులు నడిచినట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్​ సింగ్​ తెలిపారు.

Minister of State for Civil Aviation, Hardeep Singh said that 532 domestic flights were on Monday.
తొలిరోజు నడిచిన దేశీయ విమానాలెన్నో తెలుసా?

కరోనాతో లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో ఆగిపోయిన విమాన సర్వీసులు దాదాపు రెండు నెలల తర్వాత మళ్లీ ప్రారంభమయ్యాయి. సోమవారం ఒక్క రోజే 532 దేశీయ విమాన సర్వీసులు నడిచాయని.. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి వెల్లడించారు. ఈ విమానాల్లో మొత్తం 39,231 మంది ప్రయాణం చేసినట్లు తెలిపారు.

దిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయం నుంచి 243 విమానాలు రాకపోకలు సాగించాయి. దిల్లీకి వచ్చిన విమానాలు 118 కాగా.. దేశ రాజధాని నుంచి 125 విమానాలు బయటకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. మరో 82 విమాన సర్వీసులు రద్దయ్యాయి. మున్ముందు ఈ సర్వీసుల సంఖ్య మరింతగా పెరుగుతుందని పేర్కొన్నారు.

ఆంధ్రా​లో మంగళవారం నుంచే...

ఏపీలో మే 26 నుంచి, పశ్చిమ బంగా‌లో మే 28 నుంచి విమానాల రాకపోకలు మొదలవుతాయి. మరోవైపు, విమాన ప్రయాణికులను క్వారంటైన్‌లో ఉంచడంపై.. పలు రాష్ట్రాలు విడుదల చేసిన మార్గదర్శకాలు భిన్నంగా ఉండటం వల్ల గందరగోళం తలెత్తుతోంది.

Last Updated : May 26, 2020, 7:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.