సర్వోన్నత న్యాయస్థానంలో వాదనలు వినిపించే న్యాయవాదులకు కనీస అనుభవ ప్రాతిపదికను అమలు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎస్.ఎ. బోబ్డే ప్రతిపాదించారు. ఎంత అనుభవం ఉండాలనే విషయంపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ)కు సూచించారు.
అత్యవసర విచారణ కోసం పిటిషన్లను మెన్షనింగ్ అధికారి వద్ద లిస్ట్ చేయించడంలో న్యాయవాదులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎస్సీబీఏ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవె గురువారం జస్టిస్ బోబ్డే, జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం ఎదుట ప్రస్తావించినపుడు సీజేఐ ఈ ప్రతిపాదన చేశారు.