జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. మెల్‌హురా, జైనాపురా ప్రాంతాల్లో తీవ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతాదళాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగపడ్డారు.
ఉగ్రమూకల దాడులను తిప్పికొట్టిన సైన్యం ఎదురుకాల్పులు చేసింది. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులను హతమార్చినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.