ETV Bharat / bharat

కూలీల కన్నీటి యాత్రలు.. 100ల కి.మీ నడుస్తూ, రిక్షా తొక్కుతూ...

కరోనా మహమ్మారి సామాన్యుడిని ముప్పుతిప్పలు పెడుతోంది. దేశవ్యాప్త లాక్​డౌన్​తో వలస కార్మికులు పట్టణాల్లో ఉండలేక, సొంత ఊర్లకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు, రైళ్లు, విమాన సౌకర్యాలు లేకపోయేసరికి వందల కిలోమీటర్లు నడిచైనా ఇంటికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Migrant workers forced to walk hundreds of kilometres due to their villages due to corona lockdown
కూలీల కన్నీటి యాత్రలు... 100ల కి.మీ నడుస్తూ, రిక్షా తొక్కుతూ...
author img

By

Published : Mar 28, 2020, 12:42 PM IST

Updated : Mar 28, 2020, 12:51 PM IST

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్త లాక్​డౌన్ కొనసాగుతోంది. ఎవరింట్లో వారు కాలిమీద కాలేసుకుని కూర్చుని దేశాన్ని రక్షించే పనిలో ఉన్నారు. కానీ, సొంతూరుకు దూరంగా ఉన్నవారి పరిస్థితి ఏంటి? ఊరు గాని ఊర్లో బతుకీడుస్తున్న వలస కార్మికులు లాక్​డౌన్​ కారణంగా ఉపాధి కోల్పోయారు. ఇళ్లకు వెళ్లిపోదామంటే రవాణా సౌకర్యాలు లేవు. చేసేదేమీ లేక రిక్షాల్లోనే రాష్ట్రాలు దాటి ఇళ్లకు చేరే ప్రయత్నం చేస్తున్నారు కొందరు. అదీ కుదరకపోతే జాతీయ రహదారులపై పాదయాత్రలు చేస్తున్నారు.

కూలీల కన్నీటి యాత్రలు... 100ల కి.మీ నడుస్తూ, రిక్షా తొక్కుతూ...

నడిచెళ్లిపోతాం..

సామాజిక దూరం పాటించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపును బేఖాతరు చేస్తూ.. ఉత్తర్​ప్రదేశ్​ నొయిడాలో వలస కార్మికులు కుటుంబసమేతంగా నడిచి సొంత ఊర్లకు పయనమయ్యారు. మహిళలు, పిల్లలను వెంటబెట్టుకుని భారీ సంఖ్యలో జాతీయ రహదారిపై కాలినడక సాగిస్తున్నారు. అడిగితే.. మా కంపెనీలకు సెలవులిచ్చారు, మేమిక్కడుండి ఏం చేయాలి అంటున్నారు.

migrant-workers-forced-to-walk-hundreds-of-kilometres-due-to-their-villages-due-to-corona-lockdown
నడిచెళ్లిపోతాం..

"నేను హరియాణా, బహదూర్​గఢ్​ (సుమారు 358కి.మీల దూరం)​ నుంచి నడుస్తూ వస్తున్నా.. నేను ఈటాకు వెళ్లాలి. నేను పనిచేసే సంస్థ మూతబడింది. ఇంక నాకు ఊరెళ్లిపోవడం తప్ప వేరే దారేది?"

- ఆశిష్​, వలస కార్మికుడు

రిక్షా తొక్కుకుంటూ..

రిక్షా తొక్కుతూ...

దిల్లీ నుంచి వందల కిలోమీటర్లు రిక్షా తొక్కుతూ సొంత రాష్ట్రాలకు వెళ్లాలనుకున్న కొంతమంది రిక్షావాలాలను అక్షరధామ్ పోలీసులు అడ్డకున్నారు. ప్రత్యేక బస్సులైనా ఏర్పాటు చేస్తాం కానీ, కేవలం ఇంటికెళ్లేందుకు ఇంతటి సాహసాలు చేయొద్దని కోరారు.

"ఇక్కడ (దిల్లీలో) మాకు పని దొరకట్లేదు. అందుకే, మా రిక్షాలోనే బంగాల్​కు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. మేమిద్దరం రిక్షా తొక్కుతాం. ఇలా వెళితే కనీసం 7 రోజుల్లో మేము ఇళ్లు చేరుతాం. కానీ, పోలీసులు మమ్మల్ని వెనక్కి పంపించేస్తున్నారు. వారు మా అందరినీ ఓ ప్రత్యేక బస్సులో పంపిస్తామన్నారు."

-పాంచు మండల్​, రిక్షావాలా

బస్సు అందుకునేందుకు..

వలస కార్మికుల కోసం ఉత్తర్​ప్రదేశ్​ ఆర్​టీసీ దిల్లీ నుంచి ప్రతి రెండు గంటలకు ఓ బస్సు ఏర్పాటు చేసింది. దీంతో సమయానికి బస్సులు అందుకునేందుకు వందల సంఖ్యలో జనం గుమిగూడారు. దిల్లీ, గురుగ్రామ్​ల నుంచి సొంత గ్రామాలకు వెళ్లేందుకు బస్టాండుల్లో బారులు తీరారు.

అమ్మ ఆఖరి చూపుకై..

దేశవ్యాప్త లాక్​డౌన్​ మురకీమ్​ జీవితంలో మర్చిపోలేని విషాదాన్ని నింపింది. రాయ్​పుర్​లో వలస కార్మికుడిగా జీవనం సాగిస్తున్న మురకీమ్​కు సొంతూరు వారణాసిలో అమ్మ మరణించిందన్న వార్త తెలిసింది. బస్సులు, రైళ్ల బంద్​ కారణంగా చివరిసారిగా తల్లిని చూసుకునేందుకు స్నేహితులు వివేక్​, ప్రవీణ్​​తో కలిసి కాలినడక ప్రారంభించాడు. ప్రస్తుతం వీరు ఛత్తీస్​గఢ్​ కొరియా జిల్లా వైకుంఠపూర్​ చేరుకున్నారు.

"మేము దాదాపు 20కి.మీ నడిచాము. దారిలో ముగ్గురు వాహనదారులను లిఫ్ట్​ అడిగాము. వైకుంఠపుర్​కు చేరుకున్నాక ఓ మెడికల్​ షాపు యజమాని మాకు సాయం చేశాడు."

-మురకీమ్​

ఇదీ చదవండి: కరోనాపై మహాసంగ్రామంలో ముంగిళ్లకే నిత్యావసరాలు!

Last Updated : Mar 28, 2020, 12:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.