ETV Bharat / bharat

బండి లాగుతూ వందల కి.మీల 'వలస' పయనం - రాజస్థాన్​ వలసకూలీ సంజయ్​

ఉపాధి కోసం రాజస్థాన్ వెళ్లిన ఓ వలస కూలీ.. లాక్​డౌన్​ వల్ల పనిలేక ఉత్తర్​ప్రదేశ్​లోని తన స్వగ్రామానికి వెళ్లాలనుకున్నాడు. చుట్టుపక్కల వారి సాయంతో ఓ ఎద్దుల బండి కూడా సమకూర్చుకున్నాడు. వందల కి.మీలు ఎద్దుల బండిని లాగుతూ నడుస్తూ ప్రయాణం చేశాడు.

Migrant labourer yokes himself to cart, pulls family over 100 kms to reach home
బండికి తానే ఓ కాడెద్దైన వలస కార్మికుడు
author img

By

Published : May 18, 2020, 4:21 PM IST

Updated : May 18, 2020, 5:53 PM IST

బతుకుతెరువు కోసం వలస వెళ్లిన కూలీలు లాక్​డౌన్ ధాటికి విలవిలలాడుతున్నారు. ఉపాధి లేక, తమ కుటుంబాలను పస్తులుంచలేక స్వస్థలాలకు పయనమవుతున్నారు. ఆ సుదీర్ఘ ప్రయాణంలో చెప్పలేనన్ని అగచాట్లు పడుతున్నారు. ఇలాంటి బాధితుల్లో సంజయ్​ నాట్​ ఒకడు.

ఉత్తర్​ప్రదేశ్​లోని​ నాగ్లా తంగాడ్​కు చెందిన సంజయ్ నాట్​​ ఉపాధి కోసం రాజస్థాన్​లోని భరత్​పుర్​కు కుటుంబంతో సహా వలస వెళ్లాడు. అయితే లాక్​డౌన్ కారణంగా సంజయ్​కి పనిలేకుండా పోయింది. కుటుంబం పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఎదురయ్యింది. దీనితో చేసేదేం లేక తన స్వగ్రామానికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు.

లాక్​డౌన్ వల్ల ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో లేవు. స్వగ్రామానికి వెళ్లాలంటే వందలాది కిలోమీటర్లు నడిచిపోవాలి. కానీ చిన్న పిల్లలతో అంత దూరం వెళ్లడం చాలా కష్టం. దీనితో సొంతంగా ఓ ఎద్దుల బండి సమకూర్చుకోవాలని సంజయ్​ నిర్ణయించుకున్నాడు.

"కుటుంబంతో సహా రోడ్లపై ఉండే కంటే... తిరిగి సొంతూరుకే వెళ్లడం మంచిదనుకున్నాను. అందుకే నా భార్య బంగారు ఉంగరం అమ్మేసి... ఓ ఎద్దులబండి కొన్నాను. ఎద్దుల జత కొనడానికి మా వద్ద డబ్బులు లేవు. అయితే కొంతమంది సాయంతో బజారులో తిరిగే ఓ ఎద్దును సమకూర్చుకొని ఇంటికి బయలుదేరాను. అయితే ఓ ఎద్దు మొత్తం భారాన్ని మోయలేదు. కనుక నేను నడుస్తూ.. బండి లాగుతూ ఇలా ప్రయాణిస్తున్నాను."

- సంజయ్​ నాట్​, వలస కూలీ

వందల కి.మీ వలస ప్రయాణం

దేశంలో సంజయ్​ లాంటి అభాగ్యులు ఎంతో మంది ఉన్నారు. తమ సొంత గూటికి చేరుకోవడానికి వందలాది కిలోమీటర్లు పయనమవుతున్నారు. వారిలో చాలామంది అలసటకు గురై మార్గం మధ్యలోనే మరణిస్తున్నారు. మరి కొందరు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇదీ చూడండి: అంపన్​పై యుద్ధం: 37 ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు సిద్ధం

Last Updated : May 18, 2020, 5:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.