రాజస్థాన్ బికనీర్‌కు సమీపంలోని శోభాసర్ ప్రాంతంలో మిగ్-21 యుద్ధ విమానం కుప్పకూలింది. పైలట్ విమానం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. రాజస్థాన్‌లోని నాల్ ఎయిర్‌బేస్‌కు మిగ్ 21ను ఐఏఎఫ్ తరలిస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది.
మిగ్-21 కూలినట్లు బికనీర్ కలెక్టర్ ధ్రువీకరించారు. భారత్-పాక్ మధ్య పుల్వామా ఉగ్రదాడి అనంతరం పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం తలెత్తింది. పరిస్థితులు తగ్గుముఖం పడుతున్న తరుణంలో మిగ్-21 భారత్-పాక్ సరిహద్దులో కూలింది.
సైన్యం, వాయుసేన అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.