ETV Bharat / bharat

'నడ్డాపై దాడి' ఘటనలో ముగ్గురు ఐపీఎస్​లకు సమన్లు - who were responsible for BJP chief J P Nadda's security

బంగాల్​కు చెందిన ముగ్గురు ఐపీఎస్​ అధికారులకు సమన్లు జారీ చేసింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా బంగాల్​ పర్యటనకు భద్రతా ఏర్పాట్లు చేసిన వీరిని డిప్యుటేషేన్​పై కేంద్రంలో సేవలందించాలని తెలిపింది. గురువారం బంగాల్​లో.. నడ్డా కాన్వాయ్​పై దాడి జరగడానికి భద్రతా పరమైన లోపాలే కారణమని కేంద్రం భావించి, ముగ్గురు ఐపీఎస్​ల​కు ఈ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది.

MHA calls 3 West Bengal IPS officers to serve in central deputation
నడ్డా కన్వాయ్​పై దాడి ఘటనలో ముగ్గురు ఐపీఎస్​లకు సమన్లు
author img

By

Published : Dec 12, 2020, 4:47 PM IST

Updated : Dec 12, 2020, 5:30 PM IST

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బంగాల్​లో గురువారం పర్యటించినప్పుడు భద్రతా ఏర్పాట్లు సమీక్షించిన ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కేంద్రం సమన్లు జారీ చేసింది. వీరిని సెంట్రల్​ డిప్యుటేషన్​పై పనిచేయాలని తెలిపింది.

నడ్డా గురువారం.. బంగాల్​లో పర్యటించినప్పుడు ఆయన కాన్వాయ్​పై రాళ్ల దాడి జరిగింది. దీనికి భద్రతాపరమైన ఏర్పాట్లలో లోపాలే కారణమని కేంద్రం భావిస్తోంది. అందుకే నడ్డా పర్యటన సమయంలో విధులు నిర్వహించిన ఆ ముగ్గురిపై చర్యలు తీసుకుంది.

బంగాల్​లో అధికార తృణమూల్, భాజపా మధ్య ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో కేంద్రం తాజా చర్యలతో ఇది తీవ్ర రూపం దాల్చే అవకాశముంది. నడ్డా కాన్వాయ్​పై దాడి ఘటనపై రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. దాడి తృణమూల్​ కార్యకర్తల పనే అని కమలం పార్టీ ఆరోపిస్తోంది. భాజపానే డ్రామాలు ఆడుతోందని దీదీ ప్రభుత్వం చెబుతోంది.

సాధారణంగా ఐపీఎస్ అధికారులు డిప్యుటేషన్​పై కేంద్రానికి సేవలందించాలంటే.. ముందుగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. కానీ బంగాల్ ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ముగ్గురు ఐపీఎస్​లకు కేంద్రం సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: జేపీ నడ్డా కాన్వాయ్​పై రాళ్ల దాడి

Last Updated : Dec 12, 2020, 5:30 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.