ETV Bharat / bharat

బంపర్​ ఆఫర్​: మొక్క నాటు.. రూ.1000 పట్టు! - Harit Kandhar family in Maharastra

మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాలని పలువురు నిపుణులు సూచిస్తున్నా.. ఎక్కువమంది ఆసక్తి చూపటం లేదు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నాందేడ్​కు చెందిన ఓ కుటుంబం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మొక్క నాటితే.. రూ. 1000 ఇస్తామని చెబుతోంది.

Plant a tree .. get a thousand rupees
హరిత్​ కంధార్
author img

By

Published : Jun 13, 2020, 12:27 PM IST

పర్యావరణ సమతుల్యతకు మొక్కలే ఆధారం. కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని రక్షించేందుకు విరివిగా మొక్కలు నాటాలని, అడవులను రక్షించాలని పర్యావరణవేత్తలు ఉద్యమాలు చేస్తున్నారు. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నా.. ఫలితాలు అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నాందేడ్​కు చెందిన ఓ కుటుంబం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మొక్కల పెంపునకు ప్రజలు ఆసక్తి చూపేలా కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మొక్క నాటి.. దానిని చెట్టుగా మారిస్తే.. రూ. 1000 ఇస్తామని చెబుతోంది.

మొక్కల పెంపకంపై హరిత్​ కంధార్​ కుటుంబం వినూత్న ప్రయత్నం

నాందేడ్​ నగరానికి చెందిన 'హరిత్​ కంధార్'​ అనే కుటుంబం.. పర్యావరణాన్ని కాపాడేందుకు మొక్కలు నాటాలని సంకల్పించుకుంది. ఇంటి పరిసరాలు, దారుల పక్కన విరివిగా మొక్కలు నాటి గ్రీన్​ సిటీగా మార్చేందుకు కృషి చేయాలని ప్రతి ఒక్కరిని కోరింది. కానీ పెద్దగా స్పందన రాలేదు. ఈ క్రమంలో ప్రజలను భాగస్వాములు చేసేందుకు వినూత్న ఆలోచన చేసింది ఆ కుటుంబం. "మొక్క నాటు.. రూ. 1000 పట్టు" అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది.

500 మొక్కలు..

ఈ ప్రచారం ప్రజల్లోకి వేగంగా వెళ్లింది. మంచి స్పందన లభించింది. నాందేడ్​ నగరంలో రోడ్ల పక్కన, ఖాళీ ప్రదేశాల్లో సుమారు 500లకుపైగా మొక్కలు నాటారు. వాటిపై నిరంతరం నిఘా పెడుతూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.

ఇదీ చూడండి: రికార్డు​ స్థాయిలో నమోదైన భూమి సగటు ఉష్ణోగ్రత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.