రామ్‌లాల్ ప్రసాద్.... బిహార్‌లోని తూర్పు చంపారన్ మోతీహరిలో పోలీసుగా పని చేస్తున్నారు. ఈయన్ను అంతా ట్రీమ్యాన్ అని పిలుస్తారు. ప్రకృతి పట్ల ఆయనకున్న ప్రేమే ఇందుకు కారణం.
ఈ నెల 6న రామ్‌లాల్ పెళ్లి. వివాహ పత్రికలో ముహూర్తం, కల్యాణ మండపం వివరాలు మాత్రమే ఇచ్చి సరిపెట్టలేదు రామ్‌లాల్. ఓటు హక్కు, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలియజెప్పారు.
"యువత జీవితంలో ముఖ్యమైన విషయాలు మూడు. అవి చదువు, పని, ఓటు. ఈ మూడు విషయాల్లో ఓటు చాలా ముఖ్యం." అని పెళ్లి కార్డుపై ముద్రించారు.
"ఓటు హక్కుపై అవగాహన కోసం చాలా కార్యక్రమాలు నిర్వహించడం చాలా సార్లు చూశాను. అప్పుడు నా మనస్సుకు అనిపించింది నేనెందుకు అలా ప్రచారం చేసి అవగాహన కల్పించకూడదని. వినూత్నంగా ఈ పని నిర్వహించాలని నిర్ణయించుకున్నా. త్వరలో నా వివాహం. ఆ వివాహ పత్రికలో ఓటు హక్కు గురించి ఒక సందేశం ముద్రించాను."
-రామ్‌లాల్ ప్రసాద్, బిహార్ పోలీస్