ETV Bharat / bharat

బహిర్భూమికి వెళ్లారు.. నీళ్ల మధ్య చిక్కుకున్నారు - maski dam karnataka

అదో రిజర్వాయర్​.. భారీ వర్షం కురుస్తోంది. సరిగ్గా అప్పుడే బహిర్భూమికి వెళ్లారు ఇద్దరు వ్యక్తులు. పని ముగించుకొని, ఇంటి ముఖం పట్టాలనుకున్న వారికి.. నీటి ప్రవాహం అడ్డంకిగా మారింది. ఎటూ కదలనీయకుండా చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

Men went to nature call Stuck between the water
బహిర్భూమికి వెళ్లారు.. నీళ్ల మధ్య చిక్కుకున్నారు.
author img

By

Published : Oct 11, 2020, 3:23 PM IST

Updated : Oct 11, 2020, 4:03 PM IST

బహిర్భూమికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు.. నీళ్ల మధ్య చిక్కుకుపోయారు. కర్ణాటక రాయచూరు​ జిల్లా మస్కిలో జరిగిందీ సంఘటన.

బహిర్భూమికి వెళ్లి నీళ్ల మధ్యే చిక్కుకున్నారు

ఏమైంది?

చెన్నబసవ, జలీల అనే ఇద్దరు వ్యక్తులు మస్కి నాలా రిజర్వాయర్​ వద్ద బహిర్భూమికి వెళ్లారు. ఇంతలో ప్రవాహం ఉద్ధృతమైంది. తిరిగిరావడానికి వీలు లేనంతగా మారింది. ఓ గట్టును ఆసరాగా చేసుకొని ఇరువురూ అక్కడే ఉండిపోయారు.

ఈ విషయాన్ని గమనించిన స్థానికులు.. అధికారులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది.. సహాయక చర్యలు చేపట్టారు.

మస్కి నాలా వద్ద భారీగా వర్షం కురిసింది. ఉదయం 3 గంటల ప్రాంతంలో 200 క్యూసెక్కుల నీటి ప్రహవాం కొనసాగింది. నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఉదయం 8 గంటలకల్లా నీటి ప్రవాహం.. 1,600 క్యూసెక్కులకు చేరింది.

ఇదీ చూడండి:'నన్ను క్షమించండి... మీ దుకాణంలో దొంగతనం చేశాను'

Last Updated : Oct 11, 2020, 4:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.