ETV Bharat / bharat

'కమిటీపై ఆధారపడలేం.. నిరసనలు కొనసాగిస్తాం' - సాగు చట్టాలపై స్టే

సాగు చట్టాలపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే సభ్యులే ఉన్నారని రైతులు అభిప్రాయపడ్డారు. వీరందరూ చట్టాలపై సానుకూలంగా స్పందించినవారేనని పేర్కొన్నారు. అందువల్ల.. కమిటీ ముందు తాము హాజరుకామని, నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Members of committee set up by Supreme Court on farm laws are pro-government: farmers
'కమిటీపై నమ్మకం లేదు.. నిరసనలు కొనసాగిస్తాం'
author img

By

Published : Jan 12, 2021, 6:24 PM IST

సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీపై తాము ఆధారపడలేమని రైతు సంఘాలు తేల్చిచెప్పాయి. కమిటీలోని సభ్యులందరూ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నవారేనని మండిపడ్డాయి. వారందరూ నూతన సాగు చట్టాలపై సానుకూలంగా వ్యాఖ్యానించినవారేనని పేర్కొన్నాయి.

ఈ నేపథ్యంలో తాము ఏ కమిటీ ముందుకు వెళ్లమని.. దిల్లీ సరిహద్దుల్లోనే ఎప్పటిలాగే నిరసన కొనసాగిస్తామని రైతుల నేత బల్బీర్​ సింగ్​ రజేవాల్​ మీడియాకు వెల్లడించారు. అసలు కమిటీ ఏర్పాటు చేయాలని తాము ఎన్నడూ కోరలేదని స్పష్టం చేశారు. వీటన్నిటి వెనుక కేంద్రం ఉందని మండిపడ్డారు.

నూతన సాగు చట్టాల అమలుపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం నిర్ణయం తీసుకుంది. సమస్య పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యుల్లో.. హర్​సిమ్రత్​ మాన్​, ప్రమోద్​ జోషి, అసోక్​ గులాటి, భూపేంద్ర సింగ్​ మాన్​, అనిల్​ ధన్వంత్​ పేర్లు ఇప్పటివరకు బయటకు వచ్చాయి.

ఇదీ చూడండి:- సుప్రీం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. కానీ: రైతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.