ఈశాన్య భారతంలో మధ్యస్థాయి తీవ్రతతో భూకంపం సంభవించింది. ఫలితంగా మిజోరం, మేఘాలయ, మణిపుర్ సహా పలు ఈశాన్య రాష్ట్రాల్లో భూమి కంపించింది.
ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో భూప్రకంపనలు వచ్చినట్టు.. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.1గా నమోదైనట్టు ప్రాంతీయ భూకంప కేంద్రం తెలిపింది. ఈ భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం ఏర్పడినట్టు ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి: ఇలా అయితే రైలు బోగీల్లో కరోనా చికిత్స కష్టమే!