ETV Bharat / bharat

'ఎస్పీ-బీఎస్పీ మధ్య దూరం శాశ్వతం కాదు' - మహాకూటమి

ఉత్తర్​ప్రదేశ్​లో జరగబోయే ఉపఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ఎస్పీతో ఈ దూరం తాత్కాలికమేనని, భవిష్యత్తులో కలిసి పని చేస్తామని తెలిపారు. ఒంటరిగా పోటీ చేసేందుకు తామూ సిద్ధమేనన్నారు ఎస్పీ అధ్యక్షడు అఖిలేశ్​ యాదవ్​.

మాయవతి
author img

By

Published : Jun 4, 2019, 12:33 PM IST

Updated : Jun 4, 2019, 12:51 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో సమాజ్​వాదీతో పొత్తుపై స్పష్టతనిచ్చారు బహుజన్​ సమాజ్​ పార్టీ అధినేత్రి మాయావతి. లోక్​సభ ఎన్నికల్లో ఎస్పీతో పొత్తు పెట్టుకున్నా ఆ పార్టీ ఓట్లు బీఎస్పీకి పడలేదన్నారు. ఈ పరిస్థితుల్లో పొత్తు కొనసాగించడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు.

మాయావతి, బీఎస్పీ అధినేత్రి

"ఇవి శాశ్వత తెగదింపులు కాదు. ఎప్పుడైతే అఖిలేశ్​ యాదవ్​ రాజకీయంగా విజయవంతం అవుతారో.. అప్పుడు మళ్లీ ఎస్పీతో కలిసి పనిచేస్తాం. ఈ విషయంలో ఆయన విఫలమయితే ఒంటరిగానే ప్రయత్నించటం మంచిదని భావిస్తున్నాం. అందుకే ఉత్తర్​ప్రదేశ్​లో కొన్ని స్థానాలకు జరగబోయే ఉపఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించాం."

- మాయావతి, బీఎస్పీ అధినేత్రి

కూటమి ఏర్పడ్డాక ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్​ యాదవ్​, ఆయన భార్య డింపుల్ యాదవ్​ తనను ఎంతో గౌరవించారని మాయావతి తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఎస్పీతో సంబంధాలు కొనసాగుతాయని చెప్పారు. దేశ ప్రయోజనాల కోసం రెండు పార్టీల మధ్య ఉన్న విభేదాలను పక్కనబెట్టినట్టు మాయావతి స్పష్టం చేశారు.

మేమూ సిద్ధమే..

మాయావతి వ్యాఖ్యలపై సమాజ్​వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్​ స్పందించారు.

"ఒకవేళ మహాకూటమి విడిపోతే అందుకు తగినట్టు వ్యవహరిస్తాం. ఉపఎన్నికల్లో వాళ్లు ఒంటరిగా పోటీ చేయాలనుకుంటే ఎస్పీ అందుకు సిద్ధంగా ఉంటుంది. జరగబోయే 11 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతాం."

-అఖిలేశ్ యాదవ్, ఎస్పీ అధ్యక్షుడు

ఇదీ చూడండి: మహాకూటమిపై ఎస్పీ, బీఎస్పీ చెరో మాట

AP Video Delivery Log - 0000 GMT News
Tuesday, 4 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2357: US CA Apple Developers Reaction AP Clients Only 4214053
Apple focuses on speed, privacy with new software
AP-APTN-2357: Argentina Gender Violence AP Clients Only 4214052
Violence against women in Argentina spurs protest
AP-APTN-2352: China Tiananmen Morning AP Clients Only 4214051
Dawn, 30 years after Tiananmen Square crackdown
AP-APTN-2313: Peru Boy AP Clients Only 4214050
Bahraini benefactor aids studious Peruvian boy
AP-APTN-2245: UK Trump Protest 2 AP Clients Only 4214049
Anti-Trump protest outside Buckingham Palace
AP-APTN-2214: US VA Shooting City Employees AP Clients Only 4214047
Virginia Beach employees seek counselling
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jun 4, 2019, 12:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.