ETV Bharat / bharat

'అయోధ్య తరహాలో మథుర, కాశీకి విముక్తి!' - Mathura and Kashi should also be freed Jaibhan Singh Pawaiya

అయోధ్య సమస్య పరిష్కారమైన విధంగానే మథుర, కాశీ నగరాలు పూర్తిగా విముక్తి పొందాలని భాజపా నేత జైభాన్ సింగ్ పవైయా పేర్కొన్నారు. మొఘలుల కాలంలో ఈ మందిరాలు అవమానానికి గురయ్యాయని అన్నారు. బాబ్రీ కేసుతో సంబంధం ఉన్న ఆయన.. సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యేందుకు ఉత్తర్​ప్రదేశ్​ వెళ్లే క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

'Mathura, Kashi should also be freed, revived as Ayodhya'
'అయోధ్య తరహాలో మథుర, కాశీలనూ విముక్తి చేయాలి'
author img

By

Published : Sep 29, 2020, 5:05 PM IST

అయోధ్యలో రామ మందిర సమస్యను పరిష్కారమైనట్లుగా మథుర, కాశీలోని మందిరాలకూ కూడా స్వేచ్ఛ లభించాలని భాజపా నేత జైభాన్ సింగ్ పవైయా అన్నారు. మథుర, కాశీలోని ఆలయాలు... ఇతర ప్రార్థనా మందిరాలకు ఆనుకొని ఉన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

మధ్యప్రదేశ్​ గ్వాలియర్​లో మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ జైభాన్.. ఈ రెండు మందిరాలను మొఘలులు తమ పాలనలో అవమానించారని వ్యాఖ్యానించారు. దీనిపై దేశంలోని హిందువుల హృదయాలు వేదనకు గురవుతున్నాయని అన్నారు.

భాజపా నేత జైభాన్ సింగ్ పవైయా

"రామ మందిర నిర్మాణానికి దారి కనుగొన్న తరహాలోనే ఈ రెండు మందిరాలను పునరుద్ధరించాలి. ఈ రెండు మందిరాలు పూర్తిగా విముక్తి పొందాలి."

-జైభాన్ సింగ్ పవైయా, భాజపా నేత

బాబ్రీ కేసుతో సంబంధం ఉన్న జైభాన్.. ఉత్తర్​ప్రదేశ్​కు వెళ్లే ముందు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో సీబీఐ ప్రత్యేక న్యాయ స్థానం ముందు బుధవారం హాజరుకానున్నారు.

ఇదీ చదవండి- 'బాబ్రీ' తీర్పు నేపథ్యంలో లఖ్​నవూలో భద్రత కట్టుదిట్టం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.