ETV Bharat / bharat

ఔరా.. ఈ పెద్దాయన బైబిల్​నే అచ్చుదింపేశారు!

మాథ్యూస్​.. ఆరు పదుల వయసున్న పెద్దాయన. ప్రస్తుతం ఎంతో మంది దృష్టిని ఆకర్షించేస్తున్నారు. ఎందుకంటే ఈ వయసులోనూ బైబిల్​ను అచ్చుగుద్దినట్లు చేతితో రాసేస్తూ, బొమ్మలు గీసేస్తూ ఔరా అనిపించుకుంటున్నారు. ఈ పెద్దాయన రాసిన కాపీని, అసలు బైబిల్​ను పక్కపక్కన పెడితే పోల్చడమూ కష్టమే!

Mathews draws attention by making a handwritten copy of the Bible, with pictures
ఔరా.. ఈ పెద్దాయన బైబిల్​నే అచ్చుదింపేశారు!
author img

By

Published : Apr 17, 2020, 7:28 AM IST

విశ్రాంత ఎకనామిక్స్​ ప్రొఫెసర్​ మాథ్యూస్​ అబ్రహం

మాథ్యూస్​ అబ్రహం ఇంట్లో నుంచి రెండు బైబిళ్లు తీసుకొస్తే.. వాటిల్లో తేడాలు కనిపెట్టడం కష్టమే! ఒకటి ముద్రించినది, రెండోది ఆయన స్వయంగా చేతితో రాసింది. అయినా ఆ గ్రంథాలు ఒకేలా ఉంటాయి. ఎందుకంటే 66 ఏళ్ల వయసులోనూ ఆయన​ బైబిల్​ను అచ్చుగుద్దినట్లు చేతితో రాస్తున్నారు. అంతేకాదు ఆ పవిత్ర గ్రంథంలోని పటాలనూ చక్కగా గీసేస్తున్నారు. ఇందుకు ఏకంగా నాలుగేళ్లు శ్రమించారు.

కొట్టారక్కరలోని త్రికన్నమంగళ్​కు చెందిన విశ్రాంత ఎకనామిక్స్​ ప్రొఫెసర్​ మాథ్యూస్​ అబ్రహం. పదవీ విరమణ తర్వాత మొత్తం బైబిల్​ను చేత్తో రాయాలనే ఆలోచన వచ్చింది. వెంటనే రాయటం మొదలుపెట్టారు. అయితే రాతపై పట్టు సంపాదించిన ఆయన.. ప్రస్తుతం ప్రింటెడ్​ వెర్షన్​ను పోలినంతగా తన అక్షర శైలిని మార్చుకున్నారు. బెంగళూరు బైబిల్​ సొసైటీ ప్రచురించిన 266 పేజీల కొత్త నిబంధన, 902 పేజీల పాత నిబంధన బైబిల్​ను అచ్చుగుద్దినట్లు రాయడమే కాకుండా వాటిల్లోని మ్యాప్​లనూ యథావిధిగా గీసేశారు.

జర్మనీ పెన్నులతో

ఈ బైబిల్​ రాయడానికి మాథ్యూస్ జర్మనీ నుంచి తెచ్చిన ఫౌంటన్​ ఇంక్​ పెన్నులను ఉపయోగించారు. అంతేకాకుండా బైబిల్​లో ఓ అక్షరం ఎక్కడ ముగుస్తుందో మాథ్యూస్​ రాసినది అలానే ఉంటుంది. ఈయన రాసిన బైబిల్ కాపీలో.. రెండు నిలువు వరుసలు, 52 లైన్లలో వాక్యాలు కూర్చారు. ఫలితంగా మాతృకను పోలినట్లే అదనపు పేజీ, అదనపు స్థలం పుస్తకంపై కనిపించదంటే ఆశ్చర్యమే కదా. 28 ఏళ్లు కాలేజీ ప్రొఫెసర్​గా పనిచేసిన మాథ్యూస్​.. ఇప్పుడు అన్ని మత గ్రంథాలను చేతితో రాయాలని ప్రయత్నిస్తున్నారు.

ఇదీ చదవండి: 'పరీక్షల సంఖ్య పెరిగితేనే కరోనా కట్టడి సాధ్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.