ETV Bharat / bharat

లిప్​స్టిక్​కు కరోనా కష్టాలు- నయనాలకు నయా సొబగులు

author img

By

Published : Jun 24, 2020, 12:58 PM IST

Updated : Jun 24, 2020, 4:56 PM IST

ఎంత మేకప్​ వేసినా, వేయకపోయినా... పెదాలకు కాస్త రంగు పూస్తే చాలు... అమ్మాయిల సౌందర్యం రెండింతలు పెరిగిపోతుంది. అందుకే, ఆ రంగు రంగుల లిప్​స్టిక్​ అంటే.. అమ్మాయిలకు భలే ఇష్టం. కానీ, కరోనా వల్ల ఆ అందం ఇప్పుడు కనుమరుగైంది. మాస్కులు ఆ అదరాలను కప్పేసి, లిప్​స్టిక్​తో పనిలేకుండా చేస్తున్నాయి. దీంతో కళ్ల మేకప్​కు డిమాండ్​ పెరిగింది.

MASKS-LIPSTICKS
లిప్​స్టిక్​కు కరోనా కష్టాలు- నయనాలకు నయా సొబగులు

లాక్​డౌన్ మొదలైనప్పటి నుంచి ఇళ్లకే పరిమితమైన మగువలు.. దాదాపు మూడు నెలల తర్వాత మేకప్​ సామాను బయటకు తీశారు. కానీ, కరోనా కాలంలో తప్పనిసరైన మాస్కుల వల్ల తమకెంతో మక్కువైన లిప్​స్టిక్​ను మాత్రం వాడే అవసరం రావట్లేదు. ఇన్నాళ్లు లిప్​ గ్లాస్​, లిప్​ మ్యాట్టేస్​, లిప్​ లైనర్​, లిప్​ న్యూడ్​ టచెస్​ వంటి పెదాల అలంకరణకు అలవాటై.. ఇప్పుడు ఒక్కసారిగాగా వాటిని మానలేకపోతున్నారు. అలా అని మాస్కు కింద లిప్​స్టిక్​ వేసుకుని తిరగలేకపోతున్నారు. అందుకే కళ్లను మరింత అందంగా అలంకరిస్తున్నారు.

నయనానందమే...

లిప్​స్టిక్​ పూయనిదే ఈ తరం అమ్మాయిల అలంకరణ పూర్తి కాదు. కానీ, లిప్​స్టిక్​ దట్టంగా పూసుకుని, మాస్క్​ ధరిస్తే అందమైన మూతి కాస్తా.. కోతిలా మారతుంది అంటున్నారు కొందరు స్టైలిస్ట్​లు. అందుకే, మాస్క్​ పెట్టుకున్నా కనిపించే.. కళ్లను మాత్రమే అమ్మాయిలు అందంగా మార్చుకుంటున్నారని చెబుతున్నారు.

"మాస్కులు మొహానికి కట్టుకుంటే.. అవి అదరాలకు తగులుతూనే ఉంటాయి. దీంతో లిప్​స్టిక్​ పెట్టుకున్నా ప్రయోజనం ఉండదు. ఒకవేళ పెట్టుకుంటే.. ఆ మాస్కు మూతికి అతుక్కుపోతుంది. "

-ఫాతిహా తాయేబా, బ్యూటీషియన్​, గురుగ్రామ్

"మాస్కుల ధరించినప్పుడు.. కళ్లు, నదురు మాత్రమే కనిపిస్తాయి. కాబట్టి, ఇకపై అమ్మాయిలు ఐబ్రో, ఐలాషెస్, ఐలైనర్​, ఐ షాడోస్​, డ్రమటిక్​ వింగ్​, మస్కరా వంటి కళ్ల మేకప్​ సామగ్రినే అధికంగా వినియోగిస్తారనిపిస్తోంది. "

- స్టాఫోర్డ్ బ్రగాంజా, మేకప్ ఆర్టిస్ట్​, లోరియల్​ ప్యారిస్​

లిప్​స్టిక్​ కలకాలం ఉంటుంది!

అమ్మాయిలు అదరాలకు రంగులు పూయడం పూర్తిగా మానేయడమనేది జరగదని కచ్చితంగా చెబుతున్నారు మేకప్​ పరిశ్రమలోని కొందరు నిపుణులు. ప్రస్తుతానికి లాక్​డౌన్​ కారణంగా నిత్యావసర సరుకులకు మాత్రమే అమ్మకాలు పరిమితయ్యాయి. కాబట్టి లాక్​డౌన్​ పూర్తిగా ఎత్తివేసిన తర్వాత లిప్​స్టిక్​ కొనుగోళ్లు ఎప్పటిలాగే ఉంటాయని అంచనా వేస్తున్నారు.

"కరోనా తర్వాత లిప్​స్టిక్​ ట్రెండ్​ కాస్త మారుతుంది.. ఆఫీస్​ వీడియో కాన్ఫరెన్సులు, వర్చువల్ డేట్స్​ సమయాల్లో లిప్​స్టిక్​ వాడకం పెరుగుతుంది. దీంతో.. వీడియోలో అదరాల అందాలు కనిపించే వినూత్న ఆవిష్కరణలకు తావిస్తోంది" అంటున్నారు సౌందర్య పరిశ్రమ నిపుణులు.

"ఇకపై లిప్​స్టిక్​ ట్రెండ్​ కాస్త మారుతుంది. మహిళలు లిప్​స్టిక్​ రంగుల ఎంపికలో మార్పులు చేస్తారు. న్యూడ్​ కలర్స్​, మ్యాట్ లిక్విడ్​ లిప్​స్టిక్ వినియోగం పెరుగుతుంది. మ్యాట్ ​ లిప్​స్టిక్ త్వరగా ఎండిపోతుంది. కాబాట్టి మాస్క్​కు అంటుకునే అవకాశం చాలా తక్కువ."

-రాధికా శర్మ, లుకుల్లన్​ స్టూడియోస్​

ఇక కొందరు యువతులైతే... లిప్​స్టిక్​ను తమ నుంచి ఎవరూ దూరం చేయలేరని బల్ల గుద్ది చెబుతున్నారు.

"నేను లిప్‌స్టిక్‌ పూసుకోవవడం మానే ప్రసక్తే లేదు. ఆ రంగులు నాకు పాజిటివ్ వైబ్స్ ఇస్తాయి. నేను లిక్విడ్ మ్యాట్ వాడతాను. ఇది త్వరగా ఎండిపోతుంది. ఒకవేళ మాస్క్​పై మరకలు అంటితే.. నేను దానిని ఉతికేస్తాను. నా మాస్క్​, నా లిప్‌స్టిక్‌లకు ఎలాంటి సమస్య లేదు" అంటోంది దిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ విద్యార్థి సౌమితా మజుందార్.​

ఇదీ చదవండి:కూరగాయల లిప్​స్టిక్​తో ఇక ఆరోగ్యం ఫెంటాస్టిక్​!

Last Updated : Jun 24, 2020, 4:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.