ETV Bharat / bharat

నానాజాతి సమితికి వందేళ్లు.. భారత్​ సాధించిందేమిటి? - Marking a hundred Years of India Multilateral Diplomacy

మొదటి ప్రపంచయుద్ధం అనంతరం భవిష్యత్​ యుద్ధాలను నివారించేందుకు ఏర్పాటైంది నానాజాతి సమితి. అయితే లీగ్​ ఆఫ్​ నేషన్స్​గా పిలిచే నానాజాతి సమితి.. రెండో ప్రపంచ యుద్ధాన్ని నివారించడంలో విఫలమైంది. అదే సమయంలోనే ఐక్యరాజ్యసమితి ఏర్పాటుకు బీజం పడింది. నానాజాతి సమితిలో వ్యవస్థాపక సభ్యత్వం పొందిన భారత్​.. ఆధునిక బహుపాక్షిక దౌత్యనీతిలో ఏ విధంగా ముందుకెళ్లిందో చూద్దాం..

Marking a hundred Years of India Multilateral Diplomacy
నానాజాతి సమితికి వందేళ్లు.. భారత్​ సాధించిందేమిటి?
author img

By

Published : Jan 10, 2020, 7:31 PM IST

Updated : Jan 11, 2020, 7:15 AM IST

యుద్ధాలకు స్వస్తి పలుకుతూ.. ప్రపంచ దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు మొదటి ప్రపంచయుద్ధం అనంతరం సరిగ్గా వందేళ్ల క్రితం.. 1920 జనవరి 10న 'లీగ్​ ఆఫ్​ నేషన్స్ (ఎల్​ఎన్​)'​ ఏర్పాటైంది. దీనినే నానాజాతి సమితి అని కూడా పిలుస్తారు. కొద్దిరోజులే పనిచేసిన ఎల్​ఎన్​.. రెండో ప్రపంచ యుద్ధాన్ని ఆపడంలో విఫలమైంది. అయినప్పటికీ.. ప్రస్తుత ఐక్యరాజ్యసమితిలోని చాలా ప్రత్యేక సంస్థలకు అప్పట్లోనే మార్గనిర్దేశం చేసింది.

రెండో ప్రపంచ యుద్ధాన్ని నివారించడంలో నానాజాతి సమితి విఫలమైనందున.. భవిష్యత్​ యుద్ధాలను నిరోధించేందుకు 1945 ఏప్రిల్​ 25న 50 దేశాల ప్రతినిధులు శాన్​ఫ్రాన్సిక్సోలో సమావేశమయ్యారు. అప్పుడే నానాజాతి సమితి వారసత్వ సంస్థగా ఐక్యరాజ్య సమితిని నెలకొల్పేందుకు అంగీకరించారు. 'ప్రపంచదేశాల మధ్య సహకారం' అనే ఎల్ఎన్ సిద్ధాంతంతోనే 1945 అక్టోబర్​ 24న ఐక్యరాజ్యసమితి ఏర్పాటైంది. 1946 ఏప్రిల్​లో జెనీవాలో నానాజాతి సమితి సభ్యులు సమావేశమై లీగ్​ ఆస్తులను ఐక్యరాజ్యసమితి బదిలీ చేయాలని నిర్ణయించారు. అప్పటినుంచి ప్రపంచ దేశాల మధ్య శాంతి, సహకారం పెంపొందించే దిశగా లీగ్ ఆఫ్​ నేషన్స్ స్థానంలో ఐక్యరాజ్యసమితి నేటికీ కార్యకలాపాలు సాగిస్తోంది.

బహుపాక్షిక దౌత్యనీతి వైపు అడుగులు

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో 1919 జూన్​లో జరిగిన వర్సేల్స్ సంధిలో భాగంగా భారతదేశం నానాజాతి వ్యవస్థాపక సభ్యత్వం పొందింది. తద్వారా నానాజాతి సమితిలో ప్రాతినిధ్యం వహిస్తున్న స్వీయ పాలన లేని ఏకైక దేశంగా పేరుగాంచింది. భారత సభ్యత్వాన్ని అసాధారణ విషయాల్లోకెల్లా అసాధారణమైనదిగా అభివర్ణించారు చరిత్రాకారులు. అయితే భారత్​ స్వయం ప్రతిపత్తి కలిగిన దేశాలతో సమానంగా చట్టపరమైన హోదాను అనుభవించిందని తెలిపారు.

నానాజాతి సమితి ద్వారా భారత్​ మొట్టమొదటి సారిగా రెండు అంశాల్లో బహుపాక్షిక దౌత్యనీతి​ వైపు అడుగులేసింది. అందులో భాగంగా శాంతి బాటలో నడుస్తూ.. యుద్ధ నివారణకు కట్టుబడి ఉండటం మొదటిది. 1927లో పారిస్​లో జరిగిన కెల్లాగ్​-బ్రియాండ్​ ఒప్పందం (శాంతి ఒప్పందం​)పై సంతకం చేసిన లీగ్​లోని 15 సభ్యదేశాల్లో భారత్ కూడా ఒకటి. యుద్ధ నివారణ కోసమే పుట్టుకొచ్చిన ఈ ఒప్పందాన్ని కార్యరూపం దాల్చడంలో కీలకపాత్ర పోషించిన అప్పటి అమెరికా విదేశాంగ కార్యదర్శి కెల్లాగ్​కు 1929లో నోబెల్​ శాంతి బహుమతి దక్కింది.

రెండోది, దేశీయ సామాజిక-ఆర్థిక అభివృద్ధిని కొనసాగించడానికి కొత్తగా సృష్టించిన ఆధునిక బహుళపాక్షిక దౌత్యనీతిలో భారత్​​ ప్రమేయం. 1922 నుంచి అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్​ఓ)లో భారత్​ శాశ్వత సభ్యదేశంగా ఉంది. భారత్​లోని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పారిశ్రామిక కార్మికుల పని గంటలను తగ్గించడం సహా భారత నావికులను ప్రత్యేకంగా పరిగణించడం వంటి అంశాలను ఈ సంస్థలో ప్రస్తావించారు.

ఫ్రాన్స్​ ప్రారంభించిన 'ఉగ్రవాద నివారణ, శిక్ష-1937' ఒప్పందంపై సంతకం చేసిన ఏకైక సభ్య దేశంగా భారత్​ నిలిచింది. ఉగ్రవాదుల విచారణ, అప్పగింత వంటి అంశాలపై దృష్టిసారించే ఈ ఒప్పందంపై బ్రిటన్ వంటి దేశాలు సంతకం చేయలేదు.

అతుల్ ఛటర్జీనే ప్రముఖం

నానాజాతి సమితి తొలి దశాబ్దంలో దీర్ఘకాలిక దౌత్యసంబంధాల్లో తనదైన ముద్ర వేసిన భారతీయ రాయబారుల్లో.. లండన్​లోని భారత్​ నాలుగో హైకమిషనర్ సర్ అతుల్ ఛటర్జీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. 1896లో సివిల్ సర్వీసెస్​ టాపర్​​ అయిన ఛటర్జీ.. లండన్​ ఆల్డ్​విచ్​లో భారత కార్యాలాయాన్ని నిర్మించడంలో విజయంసాధించారు. విదేశాల్లోని అతి పురాతన భారత దౌత్య కార్యాలయాల్లో నేటికీ ఈ భవనమే ముందుంటుంది. లీగ్​తో పాటు ఐఎల్‌ఓలో భారత ప్రతినిధి బృందానికి నాయకుడిగా.. ఛటర్జీ ప్రముఖ పాత్ర పోషించారు. 1927 ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంతో పాటు 1933 ఐఎల్‌ఓ పాలకమండలికి కూడా అధ్యక్షత వహించిన మొదటి భారతీయుడిగా నిలిచారు.

1920 డిసెంబర్ 18న నానాజాతి సమితి​ తొలి అసెంబ్లీ సమావేశం జరిగింది. ఈ చర్చల్లో భాగంగా ప్రపంచ దేశాల మధ్య మేధో సహకారం కొరకు అంతర్జాతీయ కమిటీని ఏర్పాటు చేయాలని లీగ్​ నిర్ణయించింది. అప్పట్లో ఈ లీగ్​కు పారిస్​ స్వచ్ఛందంగా నిధులు సమకూర్చింది. శాంతి, మానవజాతి ఐక్యతకు మేధో సహకారాన్ని పెంపొందించేందుకు.. 1931-38 మధ్య భారత్​ తరఫున లీగ్ కమిటీ సభ్యుడైన డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ చాలా కృషి చేశారు. రాధాకృష్ణన్ 1946-1952 మధ్య యునెస్కోలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత స్వతంత్ర భారతావనికి ఉప రాష్ట్రపతిగా (1952-1962), రాష్ట్రపతిగా(1962-1967) సేవలందించారు.

ప్రపంచశాంతికి భారత్​ కృషి

ఒక శతాబ్దం పాటు బహుళపాక్షిక దౌత్యనీతిలో సభ్యదేశంగా ఉన్న భారత్.. ప్రపంచశాంతి, సామాజిక-ఆర్థిక అభివృద్ధికి అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించేందుకు ప్రస్తుతం తన వంతు కృషి చేసే స్థితిలో నిలిచింది. రాబోయే కాలంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని పొందడం, 2022లో జరగబేయే జీ-20 సదస్సుకు అధ్యక్షత వహించడం వంటి అంశాలు ఈ లక్ష్యాన్ని సాధించడానికి ముఖ్యమైనవిగా పరిగణించొచ్చు.

(రచయిత- అశోక్​ ముఖర్జీ, అమెరికాకు భారత మాజీ రాయబారి)

Intro:Body:

Industrial production

Conclusion:
Last Updated : Jan 11, 2020, 7:15 AM IST

For All Latest Updates

TAGGED:

Gangadhar Y
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.