ETV Bharat / bharat

జాబితాలో ఉన్నా ఓటేయడం 'డౌటే' - రద్దు

ఉండేది భారత్​లోనే. ఓటరు జాబితాలోనూ పేరుంది. అయినా... ఓటు వేసేందుకు అనుమతి లేదు. అలాంటివారు ఒకరిద్దరు కాదు... దాదాపు లక్షా 20వేల మంది ఉన్నారు. ఎక్కడ? ఎందుకు?

డి ఓటర్ల జాబితాలో ఉంటే ఓటు వేసేందుకు అనర్హులు
author img

By

Published : Mar 19, 2019, 5:41 PM IST

Updated : Mar 19, 2019, 9:01 PM IST

డి ఓటర్ల జాబితాలో ఉంటే ఓటు వేసేందుకు అనర్హులు
అసోంలో దాదాపు లక్షా 20వేల మంది లోక్​సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వారిని 'డి' (సందేహాత్మక) ఓటర్లుగా ఎన్నికల సంఘం పరిగణిస్తుండడమే ఇందుకు కారణం.

జాతీయ పౌర రిజిస్టర్​లో లేకున్నా

దేశ పౌరులుగా పరిగణించాలని గతేడాది అసోంలోని 3.30కోట్ల మంది దరఖాస్తులు చేసుకున్నారు. అందులో 2.9కోట్ల మందికి జాతీయ పౌర రిజిస్టర్​-ఎన్​ఆర్​సీలో చోటు దక్కింది. మిగిలిన 40లక్షల మందికి నిరాశే మిగిలింది. వీరిలో కొందరు ఓటేయడంపైనా సందిగ్ధం నెలకొంది.

'డి'లో ఎందుకు..

ఎన్నికల వ్యవస్థలో డి(డౌట్​ఫుల్​ లేదా డూబియస్​) ఓటర్ల విధానాన్ని 1997లో తెచ్చింది భారత ఎన్నిక సంఘం. దేశ పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు సరైన ఆధారాలు ఇవ్వని వారిని ఈ జాబితాలో చేర్చుతుంది. 'డి' జాబితాలో ఉన్న వారిని 2014లోనూ ఓటింగ్​కు అనుమతించలేదు.

" ప్రస్తుతం 1.20లక్షల మంది 'డి' ఓటర్లుగా జాబితాలో ఉన్నారు. ఈ జాబితా ఎప్పటికప్పుడు అప్​డేట్​ అవుతుంది. నామినేషన్ల తుది గడువు నాటికి ఓటర్ల జాబితాకు తుదిరూపు వస్తుంది. "

- ముఖేశ్​ చంద్ర సాహూ, అసోం ఎన్నికల సంఘం ప్రధానాధికారి

అసోంలోని 14లోక్​సభ స్థానాలకు ఏప్రిల్​ 11, 18, 23 తేదీల్లో మూడు దశల్లో పోలింగ్​ జరగనుంది.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Mar 19, 2019, 9:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.