ETV Bharat / bharat

కార్గిల్ స్ఫూర్తితో కరోనాపై పోరాడదాం: మోదీ

'కార్గిల్ విజయ్ దివస్' వేళ జవాన్ల శౌర్య, పరాక్రమాలపై ప్రశంసలు కురిపించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. దేశ రక్షణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే ముందు.. జవాన్ల గురించి యోచించాలన్న వాజ్​పేయీ వ్యాఖ్యలు సదా ఆచరణీయమన్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు పెరిగిందన్న ప్రధాని.. కార్గిల్​ స్ఫూర్తితో కరోనాను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

mann ki bath of modi
'కార్గిల్ స్ఫూర్తితో కరోనాను ఎదుర్కోవాలి'
author img

By

Published : Jul 26, 2020, 11:25 AM IST

Updated : Jul 26, 2020, 12:07 PM IST

దేశాన్ని స్థిరంగా రక్షించిన సాయుధ దళాల ధైర్యం, సంకల్పం మరువలేమన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. సైనికుల శౌర్యం తరతరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు మోదీ. నాటి కార్గిల్ వీరుల పరాక్రమాలు, వీరమాతల త్యాగాలకు సంబంధించిన కథనాలను ఇతరులకు షేర్ చేయాలన్నారు మోదీ. దేశ సమగ్రతకు సైనికులు చూపే ధైర్య సాహసాలకు వందనమని ఉద్ఘాటించారు ప్రధాని.

'వాజ్​పేయీ వ్యాఖ్యలు అనుసరణీయం'

కార్గిల్ సమయంలో ఎర్రకోట నుంచి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్​పేయీ చేసిన ప్రసంగం ఇప్పటికీ అనుసరణీయమన్నారు మోదీ. ఏ కీలక నిర్ణయమైనా తీసుకునేముందు సైనికుల ప్రయోజనాలు కూడా ఆలోచించాలని వాజ్​పేయీ పేర్కొన్నట్లు చెప్పారు.

ఐక్య పోరుతోనే..

గత కొద్దినెలలుగా కరోనాపై భారత్ ఐక్యంగా పోరాడుతోందని చెప్పారు మోదీ. ఈ కారణంగానే పలు దేశాల కంటే రికవరీ రేటు ఎక్కువగా ఉందని వెల్లడించారు. ప్రారంభంలో ఉన్నంత ప్రమాదకరంగానే వైరస్ ప్రభావం ప్రస్తుతం కూడా ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మహమ్మారి నియంత్రణ దిశగా జాగ్రత్తలు పాటించాలని చెప్పారు.

ఆగస్టు 7న జాతీయ హ్యాండ్లూమ్ డే

ఆగస్టు 7న జాతీయ చేనేత వస్త్ర వేడుకలు జరుపుకోనున్నట్లు గుర్తు చేశారు ప్రధాని మోదీ. పౌరులు చేనేత వస్త్రాల ఉపయోగాన్ని పెంచి స్వదేశీ తయారీకి ప్రోత్సాహం కల్పించాలన్నారు మోదీ.

'రక్షా బంధన్'

రక్షా బంధన్ రానున్న వేళ శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని. స్థానికంగా ఉన్నవారితోనే రాఖీ వేడుకలను జరుపుకోవాలని చెప్పారు.

ఇదీ చూడండి: సైన్యంలోకి ఒకే కుటుంబం నుంచి 16 మంది

Last Updated : Jul 26, 2020, 12:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.