వ్యాపారులు, ప్రభుత్వాల మధ్య అపనమ్మకాలు ఉన్నాయని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోపించారు. ఈ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నిరంకుశ పోకడలకు స్థానం లేదన్నారు మన్మోహన్.
"దేశంలో వ్యాపార సమూహాలపై ప్రతికూల భావనలు పెచ్చరిల్లుతున్నాయి. చిన్న, మధ్య, భారీ తరహా వ్యాపార సంస్థలు వివిధ వర్గాల కోపాన్ని చవిచూడాల్సి వస్తోంది"-మన్మోహన్సింగ్, మాజీ ప్రధాని
ఈ పరిస్థితుల్లో వ్యాపారవేత్తలు, ఆయా సంస్థలపై విశ్వాసం దెబ్బతింటోందన్నారు మన్మోహన్. విదేశీ ప్రభుత్వాలు సైతం భారత వ్యాపారవేత్తలను అనుమానించే పరిస్థితి నెలకొందని తెలిపారు.
వ్యాపార వర్గాల్లో మేధోపరమైన వాతావరణాన్ని సృష్టించాల్సిన ఆవశ్యకత ఉందని, సృజనాత్మకతను పెంచి పురోగతి సాధించాలని పిలుపునిచ్చారు.