మణిపుర్ కరోనా రహిత రాష్ట్రంగా అవతరించినట్లు ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ ప్రకటించారు. రాష్ట్రంలోని కరోనా బాధితులు పూర్తిగా కోలుకున్నారని.. కొత్తగా కేసులు ఏమీ నమోదు కాలేదని ట్వీట్ చేశారు. ప్రజలు, వైద్య సిబ్బంది సహకారంతోనే మహమ్మారిని పారదోలినట్లు వెల్లడించారు.
ఈశాన్య రాష్ట్రాల్లో వైరస్ కేసులు స్వల్పంగానే నమోదయ్యాయి. అసోంలో ఎక్కువగా 35 కేసులు నమోదయ్యాయి. ఇందులో 17 మందికి ఇప్పటికే వైరస్ నయమైంది. మేఘాలయలో 11 మందికి కరోనా సోకింది.
ఇదీ చూడండి: కరోనాపై పోరుకు సహకరించాలని తబ్లీగీ అధినేత పిలుపు