ETV Bharat / bharat

అయ్యర్​ వ్యాఖ్యలపై మళ్లీ పెను దుమారం - Mani Shankar

ప్రధాని మోదీపై 2017లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సమర్థించుకున్నారు కాంగ్రెస్​ సీనియర్​ నేత మణిశంకర్​ అయ్యర్​. భాజపాను దురంహంకార పార్టీగా అభివర్ణించారు. 23వ తేదీతో మోదీని దేశ ప్రజలు సాగనంపుతారంటూ ఓ కథనాన్ని రాశారు. ఈ కథనంపై దుమారం రేగగా... వివరణ ఇచ్చారు అయ్యర్​.

అయ్యర్​ వ్యాఖ్యలపై మళ్లీ పెను దుమారం
author img

By

Published : May 14, 2019, 6:39 PM IST

Updated : May 14, 2019, 7:05 PM IST

అయ్యర్​ వ్యాఖ్యలపై మళ్లీ పెను దుమారం

2017లో ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన 'నీచ్​' వ్యాఖ్యలను సమర్థించుకున్నారు కాంగ్రెస్​ సీనియర్​ నేత మణిశంకర్​ అయ్యర్​. మరోసారి మోదీని తీవ్రంగా విమర్శిస్తూ ఓ పత్రికలో కథనం రాశారు. ఇందులో భాజపాను దురహంకార పార్టీగా అభివర్ణించారు. ఈ కథనంపై భాజపా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయ్యర్​ను 'అబ్యూసర్​-ఇన్​-చీఫ్' అంటూ విమర్శించింది.

కథనంలో ఏముందంటే...

23వ తేదీతో దేశ ప్రజలు ప్రధాని మోదీని సాగనంపుతారని కథనంలో పేర్కొన్నారు మణిశంకర్​ అయ్యర్​. దేశం చూసిన అత్యంత నోటి దురుసు ప్రధానికి.. అది తగిన ముగింపంటూ మరోసారి వివాదాస్పదంగా రాశారు.

'కశ్మీర్​ అంశం సహా మరిన్ని విషయాల్లో మోదీని విమర్శిస్తూ 2017, డిసెంబర్​ 7న నేను ఏమని వర్ణించానో గుర్తుందా? నేను జోతిష్కుడిని కాదా?' - కథనంలో అయ్యర్
2017లో మోదీని "నీచ్​ ఆద్మీ" అంటూ అయ్యర్​ సంబోధించారు. ఆ తర్వాత ఆయనను కాంగ్రెస్​ పార్టీ సస్పెండ్​ చేసింది.

భాజపా ఆగ్రహం

అయ్యర్​ కథనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు భాజపా నేత జీవీఎల్​ నరసింహా రావు. "2017లో చేసిన నీచ్​ వ్యాఖ్యలను సమర్థించుకోవడానికి 'అబ్యూసర్​ ఇన్​ చీఫ్​' అయ్యర్​ మళ్లీ తిరిగొచ్చారు" అని ట్వీట్​ చేశారు.

జీవీఎల్​ నరసింహా రావు ట్వీట్​
జీవీఎల్​ నరసింహా రావు ట్వీట్​
జీవీఎల్​ నరసింహా రావు ట్వీట్​
జీవీఎల్​ నరసింహా రావు ట్వీట్​

"అయ్యర్​ ఆ వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. మళ్లీ ఇప్పుడేమే జోతిష్కుడినంటున్నారు. కాంగ్రెస్​ ఆయనపై గతేడాది సస్పెన్షన్​ను ఉపసంహరించుకుంది. కాంగ్రెస్​ రెండు నాల్కల ధోరణి, అహంకారం మరోసారి బయటపడింది.
పాకిస్థాన్​కు సన్నిహితుడైన అయ్యర్​ ప్రధాని మోదీని దేశ వ్యతిరేకి అనే సాహసం చేశారు. దేశానికి తెలుసు నరేంద్ర మోదీ దేశభక్తి గురించి. కుటుంబ భక్తుడిగా అయ్యర్ గురించి​ అందరికీ తెలుసు. "
-- జీవీఎల్​ నరసింహా రావు ట్వీట్​

వ్యాఖ్యలను వక్రీకరించారు

భాజపా నేతల విమర్శలను తిప్పికొట్టారు అయ్యర్. రెండేళ్ల క్రితం తాను చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ సహా కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయన్నారు​. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు అవకాశం రాలేదని చెప్పారు.

" 2017 డిసెంబర్​ 7న నేను ఏఎన్​ఐ విలేకరి అడిగిన ప్రశ్నకు పూర్తి సమాధానం ఇచ్చా. అందులో ఒక్క మాటను తీసుకొని, నేను అనని మరో మాటను జోడించి.. ప్రధాని ప్రసంగాల్లో వాడుకున్నారు. ఆ వ్యాఖ్యలనే అందరూ చూపించారు. ఏఎన్​ఐ ఇచ్చిన మొత్తం ప్రసంగాన్ని ఎవరూ చూపించరు. ఒక్క వాక్యం, ఒక్క మాటను తీసుకుంటారు. అదే చాలాసార్లు చూపిస్తారు. మీ చేతిలో కెమెరానే కాదు కత్తెర(ఎడిటింగ్​) కూడా ఉంటుంది. కెమెరాను తక్కువ వాడుతున్నారు. కత్తెరను ఎక్కువగా వినియోగిస్తున్నారు. "
-- మణిశంకర్​ అయ్యర్​, కాంగ్రెస్​ సీనియర్​ నేత

ఇదీ చూడండి : 115 మేకులు మింగిన 'ఉక్కు మనిషి'

Shimla (HP), May 14 (ANI): While speaking to ANI in Himachal Pradesh's Shimla, Congress senior leader Mani Shankar Aiyar gives a clarification on an article written by him 'Was I not prophetic' and said, "I was 6 years old when Jawaharlal Nehru became Prime Minister and 23 when he passed away. I learned political discourse in that era, there is no comparison between the era of Jawaharlal Nehru and the environment created by current government.
Last Updated : May 14, 2019, 7:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.