'మేం జంతు ప్రేమికులం.. మూగ జీవాలను హింసిస్తే ఊరుకోం..' అంటూ.. వాటితో సెల్ఫీలు దిగి లైకులు కొల్లగొట్టే వారు అవి ప్రమాదంలో ఉన్నప్పుడు పట్టించుకోరు. కానీ, అలాంటి ప్రగల్భాలేవి పలకడం ఎరుగని ఓ మహిళ వీధి కుక్కను కాపాడేందుకు ప్రాణాలు ఫణంగా పెట్టింది. ప్రమాదవశాత్తు 30 అడుగుల లోతైన బావిలో పడిన శునకాన్ని బయటికి తీసేందుకు ఏ మాత్రం ఆలోచించకుండా బావిలోకి దిగింది.
బావిలో దిగిన ఆమె.. ఆ శునకానికి తాడు కట్టగా పైన ఉన్నావారు దానిని బయటకి లాగారు. అనంతరం ఆమె బావి నుంచి సురక్షితంగా పైకి వచ్చింది. ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆ శునకం బతుకుజీవుడా అనుకుంటూ పరుగులు తీసింది.
బావిలో తాళ్ల సాయంతో వేలాడుతున్న మహిళ వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్లో పంచుకున్నారు. 'కుక్కను కాపాడిన మహిళను దీవించండి' అంటూ క్యాప్షన్ కూడా పెట్టేసరికి.. వీడియోకు కామెంట్లు వెల్లువెత్తాయి..ప్రాణాలకు తెగించి శుకానికి జీవం పోసిన ఆమె తెగువకు ఎన్ని అవార్డులిచ్చినా తక్కువేననని ప్రశంసిస్తున్నారు నెటిజన్లు.
ఇదీ చదవండి:హాకీ మైదానంలో బాల్బాయ్గా 'మహ్మద్ కైఫ్'