హిమాచల్ ప్రదేశ్ మండిలో కురుస్తున్న వర్షాలకు బియాస్ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ నది ఒడ్డున పురాతన పంచవత్ర మహాదేవ్ దేవాలయం ఉంది. నదీ ప్రవాహం వల్ల పంచవత్ర దేవాలయం 30 శాతం నీట మునిగింది. మునిగిన దేవాలయానికి ఎటువంటి ముప్పు లేదని అధికారులు తెలిపారు. వందల ఏళ్ల చరిత్రగల ఈ దేవాలయం మండి రాజుల కాలంలో నిర్మించారు. దేవాలయంలో శివుడు కొలువై ఉన్నాడు.
ప్రస్తుతం బియాస్ నది సాధారణంగా ప్రవహిస్తోంది. కానీ ఎగువన కురుస్తున్న వానలకు పండోహ్ డ్యాం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దేవాలయాన్ని పూర్తిగా పరిశీలించిన పురావస్తుశాఖ అధికారులు వరద నీటితో పూర్తిగా మునిగివ ఎటువంటి ప్రమాదం లేదని తెలిపారు.
ఇదీ చూడండి:బాలింతను ఈడ్చుకెళ్లిన ఆశ్రమ నిర్వాహకులు